బండ్ల గణేష్, హరీష్ శంకర్ వివాదంపై మరో నిర్మాత కౌంటర్.. వాడు షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు!

రీసెంట్ గా గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వివాదం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ట్వీట్స్ తో కౌంటర్లు వేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేసిన వీరిద్దరు ఈ విధంగా గొడవ పడటం ఒక నెగిటివ్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. అయితే ఇంతలో మరొక స్టార్ నిర్మాత వీరిద్దరి గొడవపై ఊహించని విదంగా కామెంట్ చేశాడు.

పొరపాటున మొదలెట్టిన హరీష్..

పొరపాటున మొదలెట్టిన హరీష్..

ఈ ట్విట్టర్ వార్ మొదలవ్వడానికి కారణం అనుకోని విధంగా హరీష్ శంకర్ బండ్ల గణేష్ పేరును ప్రస్తావించకపోవడమే.. ఇటీవల గబ్బర్ సింగ్ విడుదలై 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్, అలాగే దేవి శ్రీ ప్రసాద్ ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. కానీ నిర్మాత బండ్ల గణేష్ గురించి మాత్రం ప్రస్తావించలేదు.

బండ్లగణేష్ కౌంటర్..

బండ్లగణేష్ కౌంటర్..

దీంతో బండ్ల గణేష్ హరీష్ శంకర్ ట్వీట్ పై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశాడు. అవకాశం ఇవ్వకుంటే ఆ దర్శకుడు ఎక్కడ ఉండేవాడు అని కామెంట్ చేయడంతో అలా.. ఇరువురి మధ్య ట్వీట్స్ వార్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హరీష్ శంకర్ కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

గొడవలో మరో నిర్మాత..

గొడవలో మరో నిర్మాత..

ఈ ట్విట్టర్ వార్ లో మరో నిర్మాత కూడా చేరిపోయాడు. బండ్ల గణేష్ కి కౌంటర్ ఇస్తూనే హరీష్ శంకర్ ని మెచ్చుకున్నాడు. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత పీవీపీ. గత ఏడాది నుంచి ఆయన రాజకీయాల్లో కూడా బిజీగా మారుతున్నారు. ఇక ఈ వివాదంపై స్పందిస్తూ.. ‘బ్లేడ్ బాబు ( బండ్ల గణేష్) ఇకపై నీతో సినిమా తియ్యడట..వాడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు సినిమా తీయడానికి వెయింటింగ్.. తమ్ముడు స్టార్ట్ యూవర్ కుమ్ముడు' అంటూ పీవీపీ హరీష్ శంకర్ పై పాజిటివ్ గా స్పందించారు.

Recommended Video

#Tollywood : This Famous Director Lost A Chance To Direct The Pawan Kalyan Movie | Filmibeat Telugu
హరీష్ శంకర్ స్పందిస్తూ..

హరీష్ శంకర్ స్పందిస్తూ..

పీవీపీ చేసిన ట్వీట్ పై మ్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. ‘మీ భాష భావం రెండూ నాకు అలరించాయి.. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి ‘ఫైటే' అక్కర్లేదు. ‘ట్వీటే' చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం.. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు సార్' అని ట్వీట్ చేశాడు. ఇక ఈ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X