నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు హీరోగా సినిమా ప్రారంభం
'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' లాంటి చిత్రాలతో టాలీవుడ్లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ కందుకూరి. ఈ నిర్మాత తన వారసుడు శివ కందుకూరిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నారు.
శివ కందుకూరి నటించబోయే తొలి సినిమాకు శేష సింధూ రావు డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. శేష సింధూ రావు... ఇంతకు ముందు క్రిష్ జాగర్లమూడి, సుకుమార్ వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు.

తమిళ సూపర్ హిట్ మూవీ '96'లో కీలకమైన పాత్ర పోషించిన కోలీవుడ్ నటి వర్ష బొల్లమ్మ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ధర్మపథా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి మొదలైంది.
గోపీ సుందర్ సంగీతం అందించబోతున్న ఈ రొమాంటిక్ మూవీకికి మెంటల్ మదిలో చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన వేద రామ పని చేస్తున్నారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, మధుర
శ్రీధర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











