వారికి రుణపడి ఉంటాను.. నిర్మాత ఎమోషనల్

ఓ చిన్న సినిమా కోసం సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. నాగబాబు, వైఎస్ షర్మిల, తలసాని శ్రీనివాస్ యాదవ్, పూరి జగన్నాథ్ వంటి వారంతా సినిమాను ప్రమోట్ చేశారు. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన హీరో హీరోయిన్ లుగా అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈకథలో పాత్రలు కల్పితం'.. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

నేడు(మార్చి 26) ఈ మూవీ విడుదల అవుతున్న సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడాడు. మొదటి నుంచి ఈ సినిమా కి వస్తున్న సపోర్ట్ మర్చిపోలేనిది. పాటలకు , టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది.. ఈ సినిమా కి కష్టపడి పనిచేసిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపాడు.

 Producer Rajesh naidu E Kathalo Pathralu Kalpitham Promotions

ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ వచ్చిన అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం అన్నలకు రుణపడి ఉంటానని నిర్మాత రాజేష్ ఎమోషనల్ అయ్యాడు. చిత్రం ఇంత బాగా రావడానికి వారిచ్చిన సహకారమే ముఖ్య కారణం. సినిమాలోని పాట రిలీజ్ చేసిన వైఎస్ షర్మిలకి, ట్రైలర్ లాంచ్ చేసి మా సినిమాకి హైప్ తీసుకొచ్చిన పూరీ జగన్నాధ్‌కి ధన్యవాదాలు.ఫైనల్ కాపీ సినిమా చూశాను.. సినిమా తప్పకుండ హిట్ అవుతుంది. మీరంతా ఓ రెండు గంటలు ఎంజాయ్ చేసే సినిమా ఇదని ధీమా వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X