సచిన్‌ను కలిసిన ప్రముఖ సినీ నిర్మాత.. జోరుగా రూమర్లు..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే కొత్తేమీ కాదు. మైదానంలో చిచ్చరపిడుగులా చెలరేగి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. పరుగుల వరదను కూడా పారించిన తీరును ఇప్పట్లో మరిచిపోవడం కష్టమే. అలాంటి సచిన్‌పై బయోపిక్ డాక్యుమెంటరీని తెరమీదకు తీసుకొచ్చిన ఘనత నిర్మాత రవి రవి భగ్చంద్కకే దక్కింది.

సచిన్ టెండూల్కర్ జీవితంలోని ప్రధాన ఘట్టాలతో సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ అనే సినిమాను రవి భగ్చంద్క అన్ని భాషల్లో రూపొందించారు. ఆ చిత్రానికి జేమ్స్ ఎర్స్‌కైన్ దర్శకత్వం వహించారు. అయితే పలు భాషల్లో రూపొందిన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకదారణ పొందలేకపోయింది.

ప్రస్తుతం ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నిలో సచిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా అవతారం ఎత్తారు. బిజీ బిజీగా టోర్నికి సేవలందిస్తున్నారు. తనదైన వ్యాఖ్యలతో క్రీడాభిమానులను ఆకట్టుకొంటున్నారు సచిన్. అయితే ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ పోటీల సందర్భంగా సచిన్ బయో డాక్యుమెంటరీ నిర్మాత రవి భగ్చంద్క కలుసుకొన్నారు. వారిద్దరు కలిసి ఫోటోకు ఫోజిచ్చారు.

Producer Ravi Bhagchandka mets Sachin Tendulkar

అయితే సచిన్, రవి భగ్చంద్క కలవడంపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. వారిద్దరి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ మొదలువుతుందా? అనే రూమర్లు ఊపందుకొన్నాయి. అయితే వారిద్దరి కలయిక మర్యాదపూర్వకమైనదే అనే మాట సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఇక సెమీఫైనల్‌లో భాగంగా భారత, న్యూజిలాండ్ మ్యాచ్ మంగళవారం వర్షార్పణమైంది. రిజర్వు డే బుధవారం మ్యాచ్ మళ్లీ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ కొనసాగకపోతే భారత్ నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం లేకపోలేదనే విషయాన్ని క్రీడాపండితులు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X