Pushpa 2: పుష్ప 2 వాయిదా రూమర్లకు నిర్మాత చెక్.. ఆ పక్కా ఆ రోజే రిలీజ్ అంట..

Pushpa 2: అల్లు అర్జున్ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'పుష్ప 2'. అల్లు- సుక్కు కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ వచ్చిన మూడేళ్లు అవుతున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 'పుష్ప: ది రైజ్‌'గా వచ్చిన ఫస్ట్‌ పార్ట్‌ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. మూవీ మేకర్స్ కాసుల వర్షం కురిపించింది. దీంతో అప్పుడే సీక్వెల్‌ని ప్రకటించారు.

ఈ సీక్వెల్ ప్రారంభమై కూడా మూడేండ్లు అవుతోంది. అయినా.. ఇంకా పుష్ఫ 2 షూటింగ్‌ ఇంకా పూర్తి చేసుకోలేదనీ, ఈ మూవీ ఇక ఆలస్యం అవుతుందని పలు రూమార్స్ వచ్చాయి పుష్ప 2పై. వాస్తవానికి మొదటి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న సినిమా విడుదల చేయాల్సింది కానీ, అనుకోకుండా సినిమా పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఆ వాయిదా ఒక నెలనో .. రెండు నెలలో కాదు.. ఏకంగా నాలుగు నెలలు. దీంతో విడుదల డిసెంబర్‌ 6 తేదీకి వాయిదా పడింది. అయితే.. ఈ తేదీన కూడా పుష్ప 2 విడుదల అవుతుందో లేదో అంటూ రూమర్స్ వెలువడ్డాయి. డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌కి మధ్య విభేదాలు వచ్చాయని, దీంతో బన్నీ షూటింగ్‌కి బై చెప్పేసి విదేశాలకు వెళ్లాడంటూ రకరకాల పుకార్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అయితే వాటికి బన్నీ, సుక్కు రీసెంట్‌గా పుల్ స్టాప్ పెట్టారు.

Producer Ravi Shankar About Janasena Laeders Comments On Puspa - 2

తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇటీవల 'మారుతి నగర్‌ సుబ్రమణ్యం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సుకుమార్‌తో కలిసి వెళ్లి చెప్పకనే చెప్పారు. అయినా.. 'పుష్ప 2 రీలిజ్ కు బ్రేకులు పడుతాయనీ, డిసెంబర్ 6న విడుదలయ్యే అవకాశమే లేదంటూ.. ఖచ్చితంగా మళ్లీ వాయిదా పడుతుందని రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా రూమర్స్ అన్నింటికి చెక్‌ పెట్టారు నిర్మాత రవి శంకర్‌.

తాజాగా మత్తు వదలరా 2 టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు నిర్మాత రవి శంకర్‌..ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. 'పుష్ప 2' విడుదలపై వస్తున్న పుకార్లపై స్పందించారు. "పుష్ప ది రూల్ మూవీ ఎక్స్‌ట్రార్డినరి మూవీ. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ మూవీ విడుదలను ఎవరూ ఆపలేరు ఈ డిసెంబర్‌ 6న పుష్ప 2ను వర్డల్ వైడ్ విడుదల కాబోతుందని, విడుదల తేదీలో ఎలాంటి డౌట్‌ లేదని అన్నారు. మూవీ రిలీజ్‌పై వస్తున్న రూమార్స్ ను పట్టించుకోవద్దని అన్నారు.

Producer Ravi Shankar About Janasena Laeders Comments On Puspa - 2

అవి అన్ని పుకార్లు మాత్రమే.. అందులో ఎలాంటి నిజం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనై డిసెంబర్‌ 6న పుష్ప2 సినిమా రిలీజ్‌ చేస్తామన్నారు. ఇక ఈ మూవీ షూటింగ్‌ కొనసాగతున్నదనీ, ఈ సెప్టెంబర్‌ 2న ఫస్ట్ డాఫ్ ఎడిటింగ్. నవంబర్ 20 న ఫైనల్ కాఫీ, నవంబర్‌ 25న సెన్సార్‌ బోర్డు కు, ఆ తరువాత డిసెంబర్ 6 న వర్డల్ వైడ్ గా విడుదల కానున్నదని పూర్తి షెడ్యూల్ వెల్లడించారు నిర్మాత రవి శంకర్. ఇంతలో ఎలాంటి అప్డేట్ లేవనీ, సెప్టెంబర్, అక్టోబర్‌లోనే పాటలను విడుదల చేస్తామని ప్రకటించారు. మూవీ మేకర్స్ పుష్ప 2 రిలీజ్‌పై వస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టడంతో బన్నీ ఫ్యాన్స్‌లో కొత్త ఎనర్జీ వచ్చేసింది. పుష్ప 2 జాతరకు సిద్దమవుతున్నారు అల్లు ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X