స్టార్స్ హీరోల రెమ్యూనరేషన్ పై ప్రొడ్యూసర్ రవి షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమా బడ్జెట్‌లు, స్టార్ హీరోల పారితోషికాలు, థియేటర్ ఆదాయం అన్నీ నిర్మాతల భుజాలపై భారమే. సినిమాలు సక్సెస్ అయినా కూడా లాభాల దిశగా వెళ్లకుండా ఉన్న నేపథ్యంలో, నిర్మాతలు "స్టార్ హీరోల రెమ్యూనరేషన్" అంశంపై తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ బడ్జెట్ కారణంగా పలు సినిమాలు ఫెయిల్ అవుతుండగా, ప్రేక్షకులు టికెట్ ధరలకు బలై థియేటర్‌కి రాకపోవడం, మధ్యలోనే ఓటిటి ప్రెజర్ రావడం వంటి పరిస్థితులు మరింత క్లిష్టతరం చేశాయి. ఇండస్ట్రీలో "హీరోల మార్కెట్‌తో సంబంధం లేకుండా అధిక పారితోషికాలు చెల్లించడం ప్రొడ్యూసర్లనే నష్టంలో పడేస్తోంది" అన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ సమయంలో స్టార్స్ హీరోల రెమ్యూనరేషన్‌పై మైత్రి రవి షాకింగ్ కామెంట్స్ చేశారు.

"స్టార్ హీరోలు నిజంగా నిర్మాతల కష్టనష్టాలు పట్టించుకుంటారా?" అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ సక్సెస్ మీట్‌లో నిర్మాత మైత్రి రవిశంకర్ ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. వారి బ్యానర్‌లో పనిచేసిన హీరోలందరూ నిర్మాతలకు అండగా నిలిచారని ఆయన కితాబిచ్చారు.

Producer Ravi Shankar s Shocking Comments on Tollywood Stars Remuneration Practices

రంగస్థలం సినిమా సందర్భంగా హీరో రామ్ చరణ్ చూపిన జ్ఞాపకం రవిశంకర్ తొలుత ఉదాహరణగా ఇచ్చారు. "చరణ్ గారు రంగస్థలం మూవీ సమయంలో తీసుకోవలసిన అమౌంట్‌లో కొంత భాగం సినిమాలోనే ఉంచి, ఆమె మొత్తాన్ని సంవత్సరం-రెండు సంవత్సరాల తర్వాత తీసుకున్నారు. ఆయనకు డబ్బు ప్రధానం కాదు, ప్రొడ్యూసర్ బాగు చూస్తారు" అని చెప్పారు. ఇదే విధంగా సర్కార్ వారి పాట సమయంలో మహేష్ బాబు, వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి, రవితేజ కూడా రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతకు గడువు ఇచ్చే వారేనని, ఓటీటీ అమౌంట్ లేట్ అయినా "వచ్చినప్పుడు తీసుకుంటాలేండీ" అనేవారన్నది ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించిన ఉపేంద్ర విషయంలో కూడా నిర్మాత ఆసక్తికర వివరాలు వెల్లడించారు. "సాధారణంగా ఆయన తీసుకునే పారితోషికం కన్నా తక్కువ ఆఫర్ చేసినా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు," అన్నారు. అంతేకాకుండా హీరో రామ్ పోతినేని రెమ్యూనరేషన్ పూర్తిగా తీసుకోకుండా, ఒక ప్రాంతానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను తీసుకుని నిర్మాతకు సపోర్ట్‌గా నిలిచారని చెప్పారు. నటనలోను, వ్యక్తిగత వైఖరిలోను అందరినీ ఆకట్టుకునే ఎన్టీఆర్ గురించి రవిశంకర్ మాట్లాడుతూ.. "అయన 'మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి' అనే టైప్. ఎటువంటి ఒత్తిడి ఉండదు," అని వెల్లడించారు. ఇదే పోలికలో ప్రభాస్ కూడా నిర్మాత భారం తగ్గించేందుకు సహాయం చేస్తారని చెప్పారు.

ఇటీవల భారీ సినిమాలతో ఇండస్ట్రీని కుదిపేసిన పవన్ కళ్యాణ్ విషయానికల్లా రవిశంకర్ మాటలు మరింత బలంగా వినిపించాయి. "మీకు మిగిలితే ఇవ్వండి, లేకపోతే వద్దు" అన్న ఆయన నైజం నిజంగా నిర్మాతకు భరోసా ఇచ్చేలా ఉందని తెలిపారు. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కూడా రెమ్యూనరేషన్‌ను ఏడాదికి వాయిదా వేసుకుని తీసుకున్నారని ఉదాహరణగా చెప్పారు.

అన్ని స్టార్‌లు నిర్మాతలమీద ఒత్తిడి తెస్తారని భావించే అభిప్రాయాలను ఈ వ్యాఖ్యలు కొంతవరకు తిప్పికొట్టాయి. వాళ్లతో అనుభవం ఉండాలి, నిజాయితీ ఉండాలి, పద్ధతి ఉండాలి అప్పుడు వారు కూడా నిర్మాతల కష్టాలు అర్థం చేసుకుంటారు," అన్న సంకేతం రవిశంకర్ మాటల్లో స్పష్టంగా ఉంది. సినిమా బడ్జెట్, రెమ్యూనరేషన్, లాభాలు అని ప్రొడ్యూసర్ కష్టాల్లో పడకుండా ఉండడానికి స్టార్ హీరోలు తమ రెమ్యూనరేషన్ ఆలస్యంగా తీసుకోవడం, అవసరమైతే తగ్గించడం ఇండస్ట్రీకు శుభ సూచకం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవైపు పెద్ద సినిమాలు వెనుకంజ వేస్తున్న వేళ, మరోవైపు నిర్మాతలకు అండగా నిలిచే హీరోలు ఉన్నారనే ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సానుకూల చర్చకు దారి తీస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X