సినిమా ఎలా ఉంటుందో మీ ఉహాలకే వదిలేస్తున్నాను.. నిర్మాత రవి శంకర్ పవర్ఫుల్ స్పీచ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో కనిపించడంతో అభిమానుల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమా ఈవెంట్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ తన మాటలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... తారలతో వేడుక కళకళ.. ఎవరెవరూ వచ్చారంటే..
వై.రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి నిర్మాత దిల్ రాజు గారికి అలాగే డైరెక్ట్ వేణు శ్రీరామ్ గారికి మిగతా నటీనటులకు సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. సాదారణంగా అందరు సినిమా ఎలా ఉంటుందనేది విడుదలైన స్టిల్స్ ఫొటోలను చూసి ఊహించుకుంటూ ఉంటారు. ఫొటోలతోనే సోషల్ మీడియాలో అంచనాలు పెరుగుతూ ఉంటాయి.

అయితే ఒక నార్మల్ కథలో పవన్ కళ్యాణ్ ఉంటేనే ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద కథలో పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో ఉంటే వకీల్ సాబ్ ఎలా ఉంటుందో మీ ఊహలకు వదిలేస్తున్నాను. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ హిట్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులందరికి ఆల్ ది బెస్ట్ అని.. రవి శంకర్ మాట్లాడారు. మైత్రి మూవీ మేకర్స్ లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.


Click it and Unblock the Notifications











