‘బట్టల రామస్వామి బయోపిక్కు మూవీకి హిట్ టాక్.. c/o కంచరపాలెం తరహాలో’
యువ నటీనటులు అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన పాత్రలో రాం నారాయణ్ దర్శకత్వంలో సతీష్ కుమార్, రామ్ వీరపనేని నిర్మించిన బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రం జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ, రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా తాము రూపొందించిన చిత్రానికి వస్తున్న మంచి టాక్ నేపథ్యంలో ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో జన్మించాను. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించాను. సినిమాపై అభిమానంతో ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసాను. సెవెన్ హిల్స్ బ్యానర్‌పై బిజినెస్ స్టార్ట్ చేశాను. సినీ ప్రముఖులు రామోజీరావు, రామానాయుడు, దాసరి నారాయణరావు, దిల్ రాజు స్పూర్తితో నిర్మాతగా మారాను అని అన్నారు.

బట్టల రామ స్వామి బయోపిక్కు' చిత్రానికి హిట్ టాక్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. కోవిడ్ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. నా సోదరుడు లాంటి రాంనారాయణ్‌ను నా బ్యానర్ నుంచి దర్శకుడిగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
.
ఈ మూవీలో అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక్ జైన్, లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ తమ పరిధి మేరకు నటించారు. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని c/o కంచరపాలెం తరహాలో ఉందని పోల్చడం ఆనందంగా ఉంది సతీష్ కుమార్ అన్నారు.
బట్టల రామస్వామి బయోపిక్కుతోపాటు నటి, కొరియోగ్రాఫర్ పూర్ణ నటిస్తున్న బ్యాక్ డోర్ మూవీని త్వరలో రిలీజ్ చేస్తాం. పాయల్ రాజపుత్ హీరోయిన్‌గా ఉగాది పండుగ రోజున కొత్త మూవీని ప్రారంభించాం అని నిర్మాత సతీష్ తెలిపారు.


Click it and Unblock the Notifications











