రేచీకటి కాన్సెప్ట్‌తో సెబాస్టియన్ పీసీ 524.. చంటిలో బ్రహ్మానందం మాదిరిగా.. నిర్మాతలు కాన్ఫిడెన్స్‌గా
రాజావారు రాణి గారు వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమై SR కళ్యాణమండపం సినిమా తో బ్లాక్ బస్టర్ సాదించి ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఎంతో బిజీ అరిస్టుగా మారిపోయాడు. తాజాగా తను నటిస్తున్న ఈ సినిమా పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్ బ్లైండ్‌నెస్ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ "సెబాస్టియన్" PC 524.
ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్దారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రమోద్, రాజు, జయచంద్రా రెడ్డి, కె ఎల్ మదన్ లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నమ్రతా దారేకర్ , కోమలి ప్రసాద్, హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
నిర్మాత సిద్దారెడ్డి మాట్లాడుతూ..కిరణ్‌కు వర్క్ మీదుండే డెడికేషన్ నచ్చి నా ఫ్రెండు నాగరాజు, ప్రమోద్ లతో కలసి ఈ సినిమా చేశాం. యస్ ఆర్.కళ్యాణ మండపం మూవీ చేస్తున్నప్పుడే దర్శకుడు బాలాజీ గారు ఈ కథ చెప్పడం జరిగింది. కిరణ్ బాగా చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. జ్యోవిత సినిమాస్ బ్యానర్‌పై ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో మేము చేస్తున్న ఈ సినిమా మాకు మొదటి సినిమా. బాలాజీ గారు చాలా చక్కగా తీశాడు. చంటి సినిమాలో బ్రహ్మనందం క్యారెక్టర్‌ను స్పూర్తిగా తీసుకొన్నాం. ఈ సినిమా మొత్తం అలాంటి సీన్లు ఉంటాయి.

కిరణ్ అద్బుతంగా నటించాడు. జిబ్రాన్ మ్యూజిక్ హైలెట్ అవుతుంది. సినిమా మొత్తం మదనపల్లిలో షూట్ చేశాము.మేము అనుకున్న దానికంటే మంచి ఔట్ ఫుట్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ నెల 25 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
సహ నిర్మాత నాగరాజు మాట్లాడుతూ.. జ్యోవిత సినిమాస్,ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్, జాబితా సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.కిరణ్, నమ్రత, కోమలి ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన శెబాస్టియన్ మూవీ తెలుగు ప్రేక్షకులు అనే పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడానికి ఫిబ్రవరి 25న వస్తుంది మీరందరూ మా సెబాస్టియన్ ను ఆదరించి మంచి విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను.
ఇందులో నటీనటులు చాలా చక్కగా నటించారు. డైరెక్టర్ బాలాజీ, డివోపీ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ చాలా సపోర్ట్ చేస్తూ 32 రోజుల్లో అనుకున్న బడ్జెట్ లో సినిమా కంప్లీట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కు సహకరించారు. జీబ్రాన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.ఇలాంటి టెక్నిసిషన్స్ దొరికితే చిన్న నిర్మాతలను సేవ్ చేసిన వారవుతారు. ఈ నెల 25 న వస్తున్న ఈ సినిమా అందరినీ కచ్చితంగా అలరిస్తుందని అన్నారు.
ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. సెబాస్టియన్ అనే మూవీ నాకు స్పెషల్ ప్రాజెక్ట్. కిరణ్ చాలా చక్కగా నటించాడు. బాలాజీ గారు ఫస్ట్ నుండి ప్రేక్షకులకు కొత్త కథను ఇవ్వాలని ఈ సినిమాను కొత్తగా తీశాడు. డివోపి వర్క్ చాలా బాగుంది. త్వరలో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు. డివోపీ రాజ్ కె.నల్లి మాట్లాడుతూ...ఈ సెబాస్టియన్ సినిమా రెగ్యులర్ గా ఉండదు. డీఫ్రెంట్ గా ఉంటుంది.సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.


Click it and Unblock the Notifications











