100 కోట్లు నష్టపోయా.. మహేష్, పవన్ వల్లే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు నుంచి చాలా మంది స్టార్స్ తమ పాగా వేసి ఉండొచ్చు కానీ తెలుగు సినిమా దగ్గర తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న హీరోలు మాత్రం ఇద్దరే ఇద్దరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఆ ఇద్దరు హీరోలే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు అని చెప్పాలి,

కాగా ఈ ఇద్దరు స్టార్ మధ్య ఎప్పుడు నుంచో బాక్సాఫీస్ దగ్గర యుద్ధం నడుస్తూనే వచ్చింది. దీనితో మన తెలుగు యువతలో ఆఫ్ లైన్ రికార్డులు అయినా ఆన్లైన్ రికార్డులు అయినా అంతెందుకు రీరిలీజ్ లో అయినా కూడా ఒకరి రికార్డులు ఒకరు బ్రేక్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా మారింది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

pawan kalyan mahesh babu

కాగా ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ హిట్స్ ని ఇచ్చారో పలు సినిమాలతో అంతే ఘోరమైన నష్టాలు కూడా ఇచ్చారు. అయితే తమ కెరీర్ లోనే పలు ఎపిక్ డిజాస్టర్స్ లిస్ట్ తీస్తే ఇద్దరి నుంచి ఒకే ఏడాదిలో వచ్చిన సినిమాలు రెండు కనిపిస్తాయి. మరి ఆ చిత్రాలే "ఖలేజా" మరియు "కొమరం పులి"లు.

ఒక పదిహేనేళ్ళు వెనక్కి వెళ్లినట్టు అయితే ఈ రెండు సినిమాలు పట్ల తెలుగు రాష్ట్రాల్లో నడిచిన రచ్చ అంతా ఇంతా కాదు. ఊహించని రేంజ్ హైప్ లో వచ్చిన ఈ సినిమాలు రెండూ అనూహ్యంగా భారీ డిజాస్టర్ గా నిలిచిపోయాయి. కాగా ఇంతకంటే షాకింగ్ అంశం ఈ రెండు సినిమాలు తీసింది కూడా ఒకే నిర్మాత సింగనమల రమేష్ బాబు.

కాగా ఈ రెండు సినిమా ప్లాప్ తో ఆ నిర్మాత పేరు తనపై సెటర్స్ కూడా అప్పట్లో బాగా వచ్చాయి. కాగా ఇపుడు ఇదే నిర్మాత చేసిన షాకింగ్ కామెంట్స్ పవన్, మహేష్ బాబుల అభిమానుల్లో సహా సినీ వర్గాల్లో కూడా వైరల్ గా మారాయి.

Producer Singanamala Ramesh alleges I lost 100 Crores due to Mahesh Babu Pawan Kalyan

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతో తాను ఖలేజా, కొమరం పులి సినిమాలు చేయడం మూలాన ఏకంగా 100 కోట్లు నష్టపోయాను అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ లు అలా ఆలస్యం అవుతూ చేయడం మూలాన తాను ఇంకా ఎక్కువ నష్టాలు చూడాల్సి వచ్చింది అని లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

కాగా దీనికంటే మరో షాకింగ్ స్టేట్మెంట్ కూడా తాను చేయడం జరిగింది. తాను అప్పుడు అంత నష్టపోయినప్పటికీ కనీసం ఇద్దరు హీరోలు కూడా తనని కలిసి మాట్లాడిన పాపాన పోలేదు అంటూ మరో ఊహించని వ్యాఖ్యలు మన టాలీవుడ్ టాప్ స్టార్స్ పై వారు చేశారు. దీనితో ఈ ఇద్దరు హీరోస్ విషయంలో అది కూడా ఇన్నేళ్ల తర్వాత ఈ తరహా కామెంట్స్ వింటాం అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కాగా ఈ కామెంట్స్ ప్రస్తుతం ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Read more about: mahesh babu pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X