twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా వల్ల చావు ఎంత భయంకరమంటే.. కనీసం శవాన్ని కూడా.. వివరించిన టాలీవుడ్ నిర్మాత

    |

    ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి చిన్నాభిన్నమైపోతోంది. లక్షల మంది కరోనా బారిన పడగా.. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అందిన సమాచారం మేరకు మన దేశంలోనూ దాదాపు 500మందికి కరోనా సోకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి.

    మార్చి 31వరకు లాక్ డౌన్..

    మార్చి 31వరకు లాక్ డౌన్..

    కరోనాను కట్టడి చేసేందుకు మార్చి 31 వరకు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావొద్దని అందరూ ఇంటి పట్టునే ఉండాలని సూచించింది. అయినా సరే కొంతమంది ప్రభుత్వపు సూచనలను పెడచెవిన పెడుతున్నాయి. అలాంటి వారిపై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఫైర్ అయ్యాడు.

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, మెగా అభిమాని అయిన ఎస్‌కేఎన్ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. టాక్సీవాలా వంటి చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. సామాజిక సమస్యలపై స్పందిస్తుంటాడు. గత కొన్ని రోజులుగా కరోనాకు సంబంధించిన విషయాలు చెబుతూ అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు.

    కుక్క చావు..

    కుక్క చావు..


    కుక్క చావు అంటే తెలుసా మనం కుక్కని చంపటము కాదు కుక్క చేతిలో మనం చావటం ఇది ఒక ప్రముఖమైన సినిమా లో జోక్ కానీ అతి భయంకరమైన చావు ఏంటో తెలుసా? చనిపోయిన తరువాత కనీసం కుటుంబ సభ్యులు కూడా తాకలేని విధంగా ఉండేది. అందుకే కరోనా పట్ల ప్రభుత్వాలు అంత కఠినంగా ఉన్నాయని అర్ధం చేసుకోండి నిభందనలు పాటించండని కోరాడు.

    Recommended Video

    Anchor Suma Tips To Stay Away From Corona Virus
    ఒక వారానికి సరిపడా లేవా..?

    ఒక వారానికి సరిపడా లేవా..?

    కరనా పేషెంట్ చనిపోతే.. బ్యాగ్‌లో చుట్టి, ప్లాస్టిక్ బాక్స్‌లో సీల్ వేస్తారని, కనీసం బాడీని కూడా ఇంటికి పంపించరనీ, బూడిద కూడా ఇస్తారో కూడా తెలీదని పేర్కొన్నాడు. అందుకే ఇంతలా భయపెట్టే కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మీ ఇంట్లో కనీసం వారానికి సరిపడా సరుకులు లేవా? బయటకు రాకండి ఇంట్లోనే ఉండండని కోరాడు.

    English summary
    Producer SKN Fires on people. He Says That People Should be Saty At Home. Otherwise Corona Cant be Stopped.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X