twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ ఎవరెస్ట్ చిరంజీవి అంటూ నిర్మాతగా మారిన అభిమాని.. మనసు గెలిచావంటూ మెగాస్టార్ ప్రశంస

    |

    భారతదేశానికి తూర్పున హిమాలయాలు, పశ్చిమాన బంగాళఖాతం సరిహద్దులు అని చెబుతారు. కానీ భారతీయ సినిమా పరిశ్రమలో ఎవరికైనా సహాయం అవసరముందంటే.. ఈస్ట్ మెగాస్టార్.. వెస్ట్ మెగాస్టార్.. సౌత్ మెగాస్టార్.. నార్త్ మెగాస్టార్. బ్యాక్ అంటూ ఫోర్త్ మెగాస్టార్ అంటూ నిర్మాత ఎస్‌కేఎన్ తన ప్రసంగంతో ఎమోషనల్ అయ్యారు. ఓ దశలో స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకోగా.. సుమ నేనేమీ చేయలేదని చెప్పింది. ఆ తర్వాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ..

    ఇండస్ట్రీలో ఎలాంటి సహకారం

    ఇండస్ట్రీలో ఎలాంటి సహకారం

    2002లో ఇంద్ర రిలీజ్‌కు ముందు ఏలూరులోని ఓ థియేటర్‌లో బ్యానర్లు కడుతూ ఉండేవాడిని. అలాంటి వాడు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమాకు కో ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగానంటే.. మెగాస్టార్ కారణం. ఇండస్ట్రీలో ఎలాంటి సహకారం లేకపోయినా.. మెగాస్టార్‌ను స్పూర్తిగా తీసుకొంటే.. ఎంతవరైకైనా ఎదగే ఛాన్స్ ఉంటుంది. ఈ వేదిక ముందు ఉన్న చిరంజీవి గారిని చూసి మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే బాస్ కళ్లలోకి చూసి మాట్లాడలేను అని ఎస్‌కేఎన్ చెప్పారు.

    లక్షలాది మందికి ఇన్సిపిరేషన్

    లక్షలాది మందికి ఇన్సిపిరేషన్

    చిరంజీవి అంటే నా లాంటి లక్షలాది మందికి ఇన్సిపిరేషన్. అందరివాడు. అందరికి అందనివాడు. ఆయన స్థాయికి, స్థానానికి ఇంట్లో ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీకి గానీ.. ఇండస్ట్రీలోని వారికి ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా.. వ్యవస్థకు అవసరం వచ్చినా.. ఎవరికైనా అవస్థ ఏర్పడినా మెగాస్టార్ ముందు ఉంటాడు. అందుకే ఆయన వ్యక్తిత్వాన్ని మరిచిపోలేం. ఇండియాకు ఎవరెస్ట్ ఉంది.. టాలీవుడ్‌కు ఏకైక ఎవరెస్ట్ చిరంజీవి గారే అని ఎస్‌కేఎన్ అన్నారు.

    అపాయింట్‌మెంట్స్ పక్కన పెట్టి

    అపాయింట్‌మెంట్స్ పక్కన పెట్టి

    చిరంజీవి గారికి చాలా అపాయింట్‌మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మా పక్కా కమర్షియల్ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు అని ఎస్‌కేఎన్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా గీతా ఆర్ట్స్ ఇచ్చిన ప్రోత్సాహం గురించి, అల్లు అరవింద్ గురించి ప్రస్తావించారు.

     మన కుర్రోడే. ఎప్పుడూ దూరం నుంచే

    మన కుర్రోడే. ఎప్పుడూ దూరం నుంచే

    అయితే చిరంజీవి తన ప్రసంగంలో ఎస్‌కేఎన్ గురించి మాట్లాడుతూ.. మన కుర్రోడే. ఎప్పుడూ దూరం నుంచి చూస్తుంటారు. దగ్గర వచ్చి షేర్ చేసుకొనే వారు కాదు. కానీ స్టేజ్ మీద ఇంత గొప్పగా మాట్లాడుతావని అనుకోలేదు. చాలా చక్కగా మాట్లాడావు. నా మనసును గెలుచుకొన్నావు. నా మనసులోకి వెళ్లావు. నీవు అత్యుత్తమ శిఖరాలకు వెళ్లాలని కోరుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు. చిరంజీవి మాట్లాడుతుండగా వచ్చి.. కాళ్లపై పడటంతో మెగాస్టార్ ఆశీర్వదించారు.

    జూలై 1 తేదీన పక్కా కమర్షియల్ రిలీజ్

    జూలై 1 తేదీన పక్కా కమర్షియల్ రిలీజ్

    విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూలై 1వ తేదీన రిలీజ్ అవుతున్నది.

    English summary
    Gopi Chand's Pakka Commercial pre release event held in hyderabad. Chiranjeevi is the chief guest for this movie functions. In the occassion, Chiranjeevi made emotional speach.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X