ఎవడో ప్లాన్ చేసి పంపాడు వాడికి పగిలిపోద్ది.. యాంకర్ సుమ ముందే SKN సీరియస్!
ప్రొడక్షన్ మేనేజర్ నుంచి నిర్మాతగా మారిన SKN గురించి సోషల్ మీడియా జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతను సినిమా ఈవెంట్స్ లలో మాట్లాడే విధానం కూడా ఎంతగా హైలైట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమధ్య దిల్ రాజు తమిళ డైలాగ్స్ పై కూడా అతను ఇమిటెట్ విధంగా ఇమిటేట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే మరోసారి రావణాసుర సినిమా ఈవెంట్లో అతను మాట్లాడిన విధానం కూడా మరింత హైలెట్ అయింది. ఏకంగా యాంకర్ సుమ ముందే వాడికి పగిలిపోద్ది అంటూ మాట్లాడాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రావణాసుర ఈవెంట్
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమా పెళ్లి ఏడవ తేదీన రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం రోజు బ్రాండ్ గా నిర్వహించారు ఈ వేడుకకు కొంతమంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు ఇక అందరూ వారి స్పెషల్ స్పీచ్ లతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా కొందరి మాటలు మాత్రం ఈవెంట్లో హైలెట్ గా నిలిచాయి.

కావాలనే ఇలా..
ఇక ఆయా ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో హీరోలు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు దూసుకు వచ్చి వారితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తూ ఉండడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే వీటిని కావాలనే ప్రొడ్యూసర్లు చేయిస్తున్నారని కామెంట్లు చేసేవారు సైతం లేకపోలేదు. కొందరు హీరోలు నవ్వుతూ వారికి ఫోటోలు ఇచ్చి పంపిస్తే, మరికొందరు మాత్రం ఎవరు అరేంజ్ చేశారు? ఎవరు చెబితే ఇలా వచ్చావు అంటూ అలా వచ్చిన వారిని సైతం ప్రశ్నిస్తున్న దాఖలాలు కనిపించేవి.

స్టేజ్ ఎక్కిన వెంటనే
ఇప్పుడు తాజాగా రావణాసుర ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగింది. మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు కొందరు సినీ ప్రముఖులను సైతం ఈ సినిమా నిర్మాణ సంస్థ ఆహ్వానించింది. వారిలో మెగా క్యాంపుకు చెందిన నిర్మాత ఎస్కేఎన్ కూడా ఉన్నాడు. ఎస్కేఎన్ మాట్లాడేందుకు స్టేజ్ ఎక్కిన వెంటనే ఒక యువతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనతో ఫోటో దిగేందుకు ప్రయత్నిస్తుంది.

నాతో ఫోటో ఎందుకు?
సాధారణంగా ఎవరైనా మనతో ఫోటోలు దిగుతున్నారంటే ఆనందం వ్యక్తం చేస్తాం. కానీ ఎస్కేఎన్ మాత్రం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి అసలు మీరెవరు? నాతో ఫోటో ఎందుకు దిగడానికి ప్రయత్నించారు అని అడిగితే మీ సినిమాలు నాకు చాలా ఇష్టమని ఆ యువతీ ఇంగ్లీషులో చెప్పడం కనిపిస్తోంది.

సుమ పంచ్
స్టేజి పైన సుమ కూడా ఎస్కేన్ పై పంచులు వేయడం స్టార్ట్ చేసింది. మీరు ఒక స్టార్ అని చాలా స్పెషల్ అని అందుకే ఈ విధంగా చాలామంది ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అతనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలోనే SKN మాత్రం ఎవడో బాగానే ప్లాన్ చేసి మరీ పంపించాడు అన్నట్లుగా స్టేజ్ పైన సీరియస్ గా మాట్లాడుతూనే.. తనపై తానే కౌంటర్ కూడా వేసుకున్నాడు.
వాడికి పగిలిపోతుందంటూ..
వెంటనే ఎస్కేఎన్ ఎవడో ప్లాన్ చేసి మరీ పంపించారు. నా మీద ప్రాంక్ చేయడానికి, వాడు గనక దొరికితే వాడికి పగిలిపోతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఎస్కేఎన్ భజన చేస్తాడంటూ పలు కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో తాను నిజం చెప్పినా జనం నమ్మడం లేదని ఆయన తన మీద తానే కౌంటర్ వేసుకోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











