బండ్ల గణేష్‌కు SKN వార్నింగ్.. విజయ్ దేవరకొండ పగలకొట్టేస్తాడు అంటూ..

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు.

ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందించారు. ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోవడంతోపాటు భారీగా కలెక్షన్లను రాబడుతున్నది.ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ పరోక్షంగా బండ్ల గణేష్‌ను టార్గెట్ చేశాడు. ఆయన ఏం మాట్లాడారంటే..

Producer SKN Soft Warning to Bandla Ganesh

బేబీ సినిమాతో నేను నిర్మాతను కాలేదు. ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడటానికి కారణం నా బంగారు కొండ గౌరవనీయులు విజయ్ దేవరకొండ. టాక్సీవాలా సినిమా పూర్తిగా లీక్ అయిన తర్వాత అందరూ ఓటీటీకి ఇచ్చేద్దామని అన్నారు. కానీ ఈ సినిమాకు ఎస్కేఎన్, రాహుల్ కష్టపడ్డారు. అర్జున్ రెడ్డి తర్వాత నా ఇమేజ్ డ్యామేజ్ అయినా ఫర్వాలేదు. ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ కావాలని నిలబడన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఆయన నిలబడకపోతే..రాహుల్ లేదు. ఎస్కేఎన్ లేడు. టాక్సీవాలా సినిమా లేదు అని ఎస్కేఎన్ ఎమోషనల్ అయ్యారు.

మనిషికి, మనిషి పడ్డ కష్టానికి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ కింగ్డమ్‌కు ప్రిన్స్ కేవలం విజయదేవరకొండ మాత్రమే. ప్రిన్స్ కనిపించకపోవచ్చు. కానీ ప్రిన్స్ అంటే ప్రిన్స్. ఎస్వీ రంగారావు చెప్పినట్టు.. సింహం బోన్‌లో ఉన్నా.. అడవిలో ఉన్నా సింహం సింహమే. ఆయనపై అవాకులు చెవాకులు పేలే వాళ్లకు చెబుతున్నా..ఆయన పోస్టర్ వేసి.. టీజర్, ట్రైలర్ వేయకున్నా.. ది విజయ్ దేవరకొండ పేరు కనపడితే... ఓపెనింగ్, బాక్సాఫీస్ పగలిపోద్ది. అది విజయ్ దేవరకొండ స్టామినా అని ఎస్కేఎన్ అన్నారు.

విజయ్ దేవర కొండ లైనప్ ఏమిటో నాకు తెలుసు. వాటి కోసం ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. ఆరు నెలల్లో ఆయన బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారు. ఒకసారి కొడితే ఫ్లూక్.. రెండోసారి కొడితే షేక్.. మూడోసారి కొడితే షేక్ అని నిరూపించిన స్టార్ విజయ్ దేవరకొండ అని డైలాగ్స్‌తో కేక పెట్టించాడు.

ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమా ఫంక్షన్ కోసం ఎందుకొచ్చారంటే.. తన కెరీర్‌లో గీతా గోవిందం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ కోసం.. తన తమ్ముడికి బేబీ లాంటి సక్సెస్ ఇచ్చిన ధీరజ్ మొగిలినేని, విద్య కోసం వచ్చారు అని ఎస్కేఎన్ ఆవేశంగా మాట్లాడారు.

అయితే ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు బండ్ల గణేష్ గురించే అనే విషయం స్పష్టంగా అర్దమైంది. గతవారం జరిగిన కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఒక్క హిట్ పడితే.. వాట్సాప్.. వాట్సాప్ అంటూ కొందరు స్టైల్ కొడుతారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చొంటారు. లూజ్ పాయింట్స్ వేసుకొని ఫోజులు కొడుతుంటారు అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి కామెంట్స్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో బండ్ల గణేష్‌కు ఎస్కేఎన్ ఘాటుగా సమాధానం చెప్పాడనే విషయం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X