Allu Arjun: హిందీ బేబీ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... సీక్రెట్ లీక్ చేసిన నిర్మాత!

రీసెంట్​గా టాలీవుడ్​లో కల్ట్​ క్లాసిక్​గా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న చిత్రం బేబీ. ఆనంద్​ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ యూత్​ఫుల్ లవ్​ స్టోరీ తెలుగు యూత్ ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. ఒకటికి రెండు సార్లు థియేటర్లకు వెళ్లి మరీ ఈ సినిమాను చూశారు. అయితే రొమాంటిక్ సూపర్ హిట్ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భాగం అవ్వనున్నారని తెలుస్తోంది. దాని గురించే ఈ కథనం..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ఇండియన్స్​ ఆడియెన్స్​కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పేరు వినగానే పుష్ప అంటూ సైగలతో రచ్చ చేస్తారు. ఇప్పుడు ఆయన క్రేజ్ ఆ రేంజ్​లో ఉంది మరి. సినిమాకు సినిమాకు తన నటనలో స్టైల్​లో వైవిధ్యం చూపిస్తూ దేశం గర్వించ దగ్గ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయన కనపడితే చాలు ఆడియెన్స్​లో పుష్ప అంటూ పూనకాలు వచ్చేస్తున్నాయి.

Producer SKN Use Allu Arjun Fame For Baby Hindi Remake Full Details Here

మరీ ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్​ అయితే తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ పేరునే జపం చేస్తున్నారు. అయితే ఇప్పుడాయన పుష్ప 2లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ పంద్రాగస్ట్​ను ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈయన హిందీ బేబీ రీమేక్​లో భాగం అవుతారని తెలిసింది. ఎందుకంటే ఈ కామెంట్స్​ చేసింది స్వయంగా ఈ చిత్ర నిర్మాతనే. తనే ఎస్కేఎన్​.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్కేఎన్ ఈ కామెంట్స్ చేశారు. హిందీ బేబీ రీమేక్ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. 'మీరు హిందీలో బేబీని రీమేక్​ చేస్తున్నారు. అక్కడ అల్లు అర్జున్​కు బాగా క్రేజ్ ఉంది. మరి ఆయన్ను అక్కడ ప్రమోషన్స్​కు ఉపయోగించుకుంటారా?' అని ఓ విలేకరి అడగగా .. 'హా తప్పకుండా. నాకు తెలిసిన వారందరినీ ఉపయోగించేస్తాను' అంటూ ఎస్కేఎన్ అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్​గా మారాయి. అసలే నార్త్​లో అల్లు అర్జున్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇకపోతే బేబీ కథ కూడా ఎంతటి సూపర్ హిట్ అందుకుందో తెలిసిన విషయమే. కాబట్టి ఈ సినిమాకు బన్నీ క్రేజ్ తోడైతే బాలీవుడ్​ బేబీ హిట్​​ అవ్వడం పక్కా అనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Producer SKN Use Allu Arjun Fame For Baby Hindi Remake Full Details Here

ఇక ఈ హిందీ బేబీ కోసం హీరోయిన్​గా ఓ స్టార్ కిడ్‌ను సెలక్ట్ చేశారని తెలిసింది. తను మరెవరో కాదు అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలు ఖుషి కపూర్. ఎస్‌కేఎన్‌తో పాటు బోనీ కపూర్ లేదా కరణ్ జోహార్ ఈ రీమేక్‌ను నిర్మించడంలో భాగం కానున్నారు. అందుకే ఖుషి కపూర్ ఈ రీమేక్‌ కోసం సెలెక్ట్ చేశారు. ఇకపోతే ఖుషి కపూర్ ఇప్పటికే ది ఆర్చీస్ అనే వెబ్ ఫిల్మ్​తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె యాక్టింగ్‌పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. కానీ స్టార్ కిడ్ అయిన నేపథ్యంలో ఆమె ఖాతాలోకి మరో రెండు సినిమాలు వచ్చి పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X