దృశ్యం 2 ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు.. ఆ సినిమా కంటే ముందే..
మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 హిట్టవ్వడంతో ఇప్పుడు అదే తరహాలో ఒరిజినల్ దర్శకుడితో సీక్వెల్ ను రెడీ చేస్తున్నారు. దృశ్యం 2 మలయాళం మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. భారీగా రెస్పాన్స్ అందుకోవడంతో విక్టరీ వెంకటేష్ నిమిషం కూడా ఆలోచించకుండా రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు.
ఒకవైపు F3 సినిమాను చేస్తూనే వెంకీ దృశ్యం 2ను లైన్ లో పెట్టాడు. ఇక సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తవ్వడానికి వచ్చేసింది. వెంకీ తన సీన్స్ అన్నిటినీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సినిమాను కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేయవచ్చని రూమర్స్ వచ్చాయి. థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో అదే బెటర్ అని ఆమెజాన్ ప్రైమ్ తో డీల్ సెట్ చేసుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి.

అయితే నిర్మాత సురేష్ బాబు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి నిజం లేదని దృశ్యం 2 తెలుగు ముందుగా థియేటర్స్ లోకి వచ్చిన తరువాతే ఓటీటీలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. అయితే సినిమా రిలీజ్ పై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పటికే వెంకటేష్ నారప్ప సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందు దృశ్యం 2 థియేటర్స్ లోకి రావచ్చని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











