తన అఫైర్స్ గురించి ఓపెన్ అయిన సురేష్ బాబు.. ఆవిడకి ఉంటే తట్టుకోగలనా?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా సురేష్ బాబుకి మంచి పేరుంది. తన తండ్రి డి.రామానాయుడు నుంచి వారసత్వంగా ప్రొడ్యూసర్ గా మారిన ఆయన రామానాయుడుకు సంబంధించిన సురేష్ ప్రొడక్షన్ సంస్థని మరింత ముందుకు తీసుకువెళ్లారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్లి చదువుకునే వచ్చిన సురేష్ బాబు తొలుత హీరో అవుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా నిర్మాణ రంగం వైపు మొగ్గు చూపిన ఆయన అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. చేస్తున్న సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు హిట్స్ కొడుతూ ఆయన టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా మారారు.

అయితే సురేష్ బాబు తన అఫైర్స్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు విషయం ఏంటంటే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ అనే సినిమాని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేశారు. విక్టరీ వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి కలైపులి ఎస్ ధాను ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే పలు మీడియా ఛానళ్లకు సురేష్ బాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను యాంకర్ ప్రశ్నించగా ఆ ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా సమాధానాలు చెప్పారు. తొలుత రామానాయుడు మిమ్మల్ని హీరోని చేయాలనుకున్నారు అట కదా అని ప్రశ్నించగా ఆ మాట వాస్తవమే కానీ తనకు హీరోగా చేయాలనే కోరిక ఉండేది కాదని చెప్పుకొచ్చారు.

producer Suresh Babu interesting comments on his affairs

అలాగే తన జీవితంలో తాను కొన్ని విషయాల్లో ముందే గిరిగీసుకుని ఉండడం వల్ల చుట్టూ ఎంత అవకాశాలు ఉన్నా, అవకాశాలు ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నా తాను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాను అని చెప్పారు. తన పిన్ని భర్తను చూసి తాగుడు అనేది జీవితంలో దరి చేరనివ్వకూడదని ఫిక్స్ అయ్యానని, ఆయన తాగుడు వల్ల జీవితం నాశనం చేసుకున్నాడు అని అన్నారు. అంతేకాక అవకాశాలు ఉన్నా తాను ఎవరితోనూ అఫైర్ పెట్టుకోలేదని ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళి చేసుకోవలసి ఉంది కదా అని అన్నారు.

ఒకవేళ తనకు వచ్చే భార్య కూడా తనలాగే వేరే ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుంటే దానిని భరించగలిగిన శక్తి ఉంటేనే వేరే ఎవరితోనో ఎఫైర్ పెట్టుకోవాలని అనుకున్నానని అందుకే అసలు ఆ అఫైర్స్ జోలికి వెళ్ళలేదు అని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. మొత్తం మీద సురేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X