జూ.ఎన్టీఆర్‌కు చంద్రబాబు, రేవంత్ షాక్ .. నిర్మాత క్షమాపణలు, మా చేతుల్లో ఏం లేదంటూ..

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ , జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ నటించిన మూవీ దేవర. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పలు సెంటర్లలో కొత్త రికార్డులు సృష్టిస్తూ ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అభిమానులు, చిత్ర యూనిట్ పండుగ చేసుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు షాకిచ్చాయి. ఈ వివరాల్లోకి వెళితే :

దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు నిర్మించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పాటు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ- తారక్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. హైప్‌కు తగినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో బాగానే హోల్డ్ చేసింది.

Producer suryadevara naga Vamsi apologizes to jr ntr fans about devara success meet

నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది. రూ.190 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా దేవర జర్నీ స్టార్ట్ చేశాడు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు అంటే ఏడు రోజులకు గాను దేవర దాదాపు రూ. 390 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేవర స్పీడు చూస్తుంటే నేడో రేపో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ , ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నాయి.

దీంతో దేవర సక్సెస్ మీట్ భారీగా నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. అభిమానులు కూడా ఇందుకోసం నిరీక్షిస్తున్నారు. ఇలాంటి వేళ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంచలన ప్రకటన చేశారు. దేవర ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని అనుకున్నామని.. కానీ అనుమతులు లభించలేదని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించుకోలేకపోవడంతో కనీసం సక్సెస్‌మీట్‌నైనా గ్రాండ్‌గా చేయాలని అనుకున్నామని వంశీ తెలిపారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా దేవర సక్సెస్ మీట్‌కు అనుమతులు లభించలేదని ఆయన వెల్లడించారు. ఇది మా చేతుల్లో లేదని.. సక్సెస్‌మీట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు క్షమించాలని ఎన్టీఆర్ అభిమానులను వంశీ కోరారు.

కాగా.. దేవర రిలీజ్ కావడానికి ముందు సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ హైదరాబాద్ నోవాటెల్‌లో భారీ ఏర్పాట్లు చేసింది. అయితే అది కాస్తా ఫ్యాన్స్ ఓవరాక్షన్ కారణంగా మిస్ ఫైర్ అయ్యింది. నోవాటెల్ వద్దకు అభిమానులు పోటెత్తగా.. వారిని నియంత్రించలేక పోలీసులు, నోవాటెల్ సిబ్బంది చేతులెత్తేశారు. ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆడిటోరియంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ స్థితిలో ఈవెంట్ కష్టమని భావించిన నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యారు. ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X