' ప్రగ్యా , శ్రద్ధా కొట్టించుకోనన్నారు.. అందుకే ఊర్వశితో '

నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన డాకు మహారాజ్‌ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌లు బాలయ్య పక్కన హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా ఇందులో ఐటెం సాంగ్ చేశారు. హీరోయిన్లుగా చేసిన ప్రగ్యా, శ్రద్ధలకు మించిన పాపులారిటీని ఈ సినిమా ద్వారా ఊర్వశి కొట్టేశారు. దీనికి కారణం దబిడి దబిడి సాంగ్.

తన క్లీవేజ్ షో, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో హిందీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఆమె సౌత్‌లోనూ హల్‌చల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్యలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ మాస్‌కి పూనకాలు తెప్పించింది. ఆ వెంటనే ఏజెంట్, బ్రో సినిమాల్లోనూ ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు ఊర్వశి రౌటేలా. దీంతో ఆమెకు మంచి పేరు తీసుకురావడంతో పాటు మరిన్ని అవకాశాలు క్యూకట్టాయి. హిందీ కంటే సౌత్‌పైనే తన ఫోకస్ పెట్టిన ఊర్వశి డాకు మహారాజ్‌లో ఛాన్స్ కొట్టేశారు.

Producer Suryadevara Naga vamsi clarifies why Urvashi Rautela was selected for the song Dabidi Dabidi in Daaku Maharaaj

తొలుత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారనే టాక్ వినిపించింది. అయితే అనూహ్యంగా ఆమె క్యారెక్టర్‌ను కట్ చేసి కేవలం ఐటెం సాంగ్‌కే పరిమితం చేశారని ఫిలింనగర్‌లో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంతలో బాలయ్య - ఊర్వశి కలిసి చేసిన దబిడి దిబిడి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటపై విపరీతంగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఊర్వశి నడుము, పిరుదులపై బాలయ్య దరువు వేయడంతో పాటు నాభి భాగంలో చేయి వేసి ఆమె డ్రెస్‌ను పట్టుకునే సీన్ ఉండటంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

తనకంటే 34 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో ఇలాంటి డ్యాన్స్‌లు వేయడం బాలయ్య రేంజ్‌కు మంచిది కాదని కొందరు పెదవి విరుస్తున్నారు. నటననే వృత్తిగా తీసుకున్న హీరోలు ఇలాంటి స్టెప్ప్ వేసినా పెద్దగా పోయేదం ఉండదు. కానీ బాలయ్య ఓ శాసనసభ్యుడు, పైగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉందని ఇవన్నీ గుర్తుంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చురకలంటిస్తున్నారు. అయితే బాలయ్య అభిమానులు, సినీ జనాలు విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

Producer Suryadevara Naga vamsi clarifies why Urvashi Rautela was selected for the song Dabidi Dabidi in Daaku Maharaaj

ఈ సంగతి పక్కనబెడితే.. డాకు మహారాజ్‌లో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశికి కళ్లు చెదిరే పారితోషికం ముట్టిందట. అక్షరాల రూ. కోటిని ఈ ముద్దుగమ్మ ఛార్జ్ చేసినట్లుగా ఫిలింనగర్‌లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా ఊర్వశిని ఎందుకు సెలెక్ట్ చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా డాకు మహారాజ్ ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగవంశీ, దర్శకుడు బాబీ , హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌లు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దబిడి దిబిడి సాంగ్‌‌ కోసం ఊర్వశిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందని విలేకరులు ప్రశ్నించారు. దీనికి నిర్మాత నాగవంశీ బదులిస్తూ.. బాలయ్య కొడతానంటే ప్రగ్య, శ్రద్ధాలు ఒప్పుకోలేదని అందుకే ఊర్వశిని తీసుకోవాల్సి వచ్చిందని ఒక్క ముక్కలో తేల్చేశారు. ప్రస్తుతం నాగవంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X