మిస్టర్ బచ్చన్ డిజాస్టర్‌కు కారణం హరీష్ శంకర్.. అలా గబ్బు పట్టించాడు.. నిర్మాత ఫైర్

మాస్ మహారాజ్ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ కావడంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రమే ప్రతికూలంగా మారాయి. దర్శకుడు చేసిన అత్యుత్సాహం వల్లే సినిమాకు భారీగా డ్యామేజ్ జరిగింది అని ఆయన అన్నారు. అయితే నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. మూవీ డిజాస్టర్‌‌కు ఓ కారణం దర్శకుడే అని అన్నారు. టీజీ విశ్వప్రసాద్ చెప్పిన విషయాలు ఏమిటంటే?

మిస్టర్ బచ్చన్ సినిమా విషయంలో ప్రమోషన్స్ బాగా దెబ్బ కొట్టాయి. అంతేకాకుండా సినిమాలో హిందీ పాటలు నచ్చలేదు. ఫస్టాఫ్ నాకు బాగా నచ్చింది. సెకండాఫ్‌ నాకు ఒకే అనిపించింది. ఫస్టాఫ్‌లో కొంత నిడివి తగ్గించాం. కానీ అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది అని విశ్వ ప్రసాద్ అన్నారు.

Producer TG Vishwa Prasad Fire on Harish Shankar for Mr Bachchan Disaster

మిస్టర్ బచ్చన్ సినిమా స్క్రిప్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని మేము కరెక్ట్ చేయలేకపోయాం. ఓవరాల్‌గా సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కానీ కొన్ని లాజిక్‌లు మిస్ కావడం వల్లే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలను అధిగమించలేకపోయామని ఆయన అన్నారు.

మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్‌కు ముందు అనవసరంగా మీడియాకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్యూలు ఇచ్చి గబ్బు పట్టించాడు. ఇంటర్వ్యూలు సినిమాకు పాజిటివ్‌గా మారకపోగా సినిమాపై దుష్ప్రభావం చూపాయి. దాంతో సినిమాపై భారీగా నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని ఆయన అన్నారు.

Producer TG Vishwa Prasad Fire on Harish Shankar for Mr Bachchan Disaster

సినిమా డిజాస్టర్ అని తెలిసిన తర్వాత కూడా అభిమానులతో కలిసి హరీష్ శంకర్ ప్రెస్ మీట్ నిర్వహించడం మరీ దారుణంగా మారింది. హరీష్ శంకర్ అనవసరంగా ఈ సినిమాను గబ్బు పటించాడని చేసిన విశ్వ ప్రసాద్ కామెంట్స్‌పై ఇండస్ట్రీలో రకరకాల చర్చ జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X