Raja Saab: బాహుబలి 2 సెంటిమెంట్‌తో రాజా సాబ్.. రిలీజ్ ఎప్పడో చెప్పేసిన నిర్మాత విశ్వప్రసాద్

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలను నిర్మించి భారీ నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ పాపులారిటీని సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో రాజా సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

సాఫ్ట్‌వేర్ రంగంలో అమెరికాలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందిన టీజీ విశ్వ ప్రసాద్ ఐదేళ్ల క్రితం సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆయన పలు సందర్బాల్లో తన బ్యానర్ లక్ష్యం ఫ్యాక్టరీ మోడల్‌లో సినిమాలను నిర్మించడమే లక్ష్యం. అతి తక్కువ కాలంలో 100 సినిమాలు పూర్తి చేయాలన్నది మా టార్గెట్ అని అన్నారు.

Producer TG Vishwa Prasad officially declared Prabhas s Raja Saab Release with Baahubali 2 Sentiment

ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు చిత్రాలను నిర్మిస్తున్నాయి. కొన్ని చిత్రాలు దాదాపు నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒక చిత్రం స్వాగ్. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందింది. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్బంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని సినిమాలు ఆర్థికంగా అంత లాభసాటిగా ఫలితాలు ఇవ్వలేదు. ఇటీవల వచ్చిన ఓ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. అయితే ఏప్రిల్‌లో ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం రిలీజ్ చేస్తాం. ఆ సినిమాతో మాకు ఇటీవల వచ్చిన నష్టాలన్నీ కవర్ చేస్తాం అనే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాజా సాబ్ చిత్రం వేసవిని టార్గెట్ చేసుకొని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నది. అయితే ప్రభాస్‌కు ఏప్రిల్ నెల సానుకూలమనేది ఇండస్ట్రీ అందరికి తెలిసిందే. ఏప్రిల్ నెలలో వచ్చిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా చరిత్రను తిరగరాసింది. ఈ సెంటిమెంట్‌తోనే ప్రభాస్ నటించిన రాజాసాబ్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X