రాంచరణ్ నాకు దేవుడితో సమానం.. జీవితాంతం రుణపడి ఉంటా.. వంశీ కాక ఎమోషనల్
రాంచరణ్ ముందు నిలుచొని మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఓరి దేవుడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన రాంచరణ్ గారికి వెల్‌కమ్. చాలా తక్కువ సమయంలో ఈవెంట్‌ను భారీ సక్సెస్ చేసిన రాంచరణ్ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు అని పీఆర్వో, ఓరి దేవుడా సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక అన్నారు. ఇంకా ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ..

కోవిడ్ సమయంలో బతికి ఉంటే చాలూ అనే పరిస్థితి. ఆ సమయంలో నా హీరో రాంచరణ్ ఫోన్ చేసి.. వంశీ ఎలా ఉన్నావు.. ఫ్యామిలీ ఎలా ఉంది. ఏదైనా సహాయం అవసరమైతే నన్ను అడుగు. ఈ రోజు కానీ ఎప్పుడైనా ఎలాంటి సహాయమైనా నన్ను అడుగని చెప్పిన హీరో రాంచరణ్. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని వంశీ కాక అన్నారు.
ఓరి దేవుడా సినిమాలో విక్టరీ వెంకటేష్ రూపంలో మాకు ఓ దేవుడు ఉన్నారు. ఈ సినిమాలో హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాకు లైఫ్ ఇచ్చారు. ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆషా భట్ చక్కగా నటించారు అని వంశీ కాక తెలిపారు.
నా కెరీర్‌లో ఇప్పటి వరకు 250 సినిమాలకు పీఆర్వోగా చేశాను. ఏ సినిమాకైనా పీఆర్వో చేసేటప్పుడు.. మాకు పూర్తయిన సినిమా ఇచ్చేవారు. సినిమా నిర్మాణంలో ఉండే కష్టాలు, నొప్పి తెలిసేవి కావు. ఫస్ట్ టైమ్ సినిమా బాగా వస్తుందా లేదా టెన్షన్‌ను అనుభవించాను. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఎవరైతే బాగుంటుందని తర్జనభర్జన పడ్డాను. అయితే నా సినిమాకు నా హీరోను పిలువాలని అనుకొని.. రాజమండ్రికి వచ్చాను. నేను ఇక్కడి వరకు వస్తుంటే.. ఎక్కడకు వెళ్తున్నావు అని కొందరు అడిగారు. అయితే నీవు పిలువగానే.. చరణ్ గారు వచ్చేస్తారా అని అన్నారు. అలా అడిగిన వారికి ఒకటే సమాధానం.. అన్ని టెలివిజన్ ఛానెల్స్‌లో చూడండి.. మా హీరో రాంచరణ్.. ఈ సినిమాకు గెస్టుగా వచ్చారు. ఇదిగో చూడండి.. మా రాంచరణ్ అని వంశీ కాక ఎమోషనల్ అయ్యారు.
సాయం చేసిన వారు దేవుడితో సమానం అంటారు. మా ఓరి దేవుడో సినిమాకు గెస్టుగా వచ్చి.. ఈ సినిమాకు సపోర్టుగా నిలిచిన రాంచరణ్ గారికి థ్యాంక్స్ అని వంశీ కాక అన్నారు. మీ సక్సెస్ జర్నీలో చాలా మందికి సంతోషాన్ని ఇచ్చారు. మీ జర్నీలో చిన్న రోల్‌లో ఉన్న నాలాంటి చిన్న వ్యక్తి కోసం ఇంత దూరం వచ్చారు. మీ సపోర్ట్‌ను జీవితాంతం గుర్తుంచుకొంటాను. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు అని వంశీ కాక భావోద్వేగానికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











