దర్శకుడిగా మారుతున్న నిర్మాత విశ్వనాధ్ తన్నీరు.. ఓ మంచి మెసేజ్ ఇస్తూ!
సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు దర్శకుడిగా మారబోతున్నాడు. ఇటీవలే 'M6' అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన స్వీయ దర్శకత్వంలో విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.
ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు స్పందిస్తూ.. ''సినిమా మీద ప్యాషన్‌తో ఈ రంగం లోకి వచ్చిన నేను "M6" సినిమాతో నిర్మాతగా మారాను. అయితే నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఈ క్రమంలో ఎన్నో కథలు విన్నా. చివరకు ఓ అద్భుతమయిన కథ దొరికింది. కంటెంట్ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా ఈ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇందులో హీరోగా మా గత చిత్రం "M6"లో హీరోగా చేసిన ధ్రువ నటిస్తున్నాడు. మొత్తం 4 షెడ్యూల్స్‌లో హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తాం'' అన్నాడు.

హీరో ధ్రువ మాట్లాడుతూ..''M6 సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నేను నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాననే నమ్మకం ఉంది. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్‌కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్‌లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము'' అన్నారు.
ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రంలో రాగిణి, డి.యస్. రావు , గురురాజ్, నామాల రవీంద్ర సూరి, మాస్టర్ జైనీత్, దిల్ రమేష్, శివమ్ శివరాత్రి, గిరి, తిలక్, నర్సిరెడ్డి, చంటి, సందీప్, కుమరం తదితరులు నటించనున్నారు.


Click it and Unblock the Notifications











