Acharya Release Date: మెగా మల్టీస్టారర్ వాయిదా.. నిర్మాతల కామెంట్స్‌తో క్లారిటీ

సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతూ.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఆరు పదుల వయసులోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ మధ్య రాజకీయాల కోసం చాలా గ్యాప్ తీసుకున్న ఆయన.. కొన్నేళ్ల క్రితమే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటిస్తూ యమ జోస్‌తో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

మెగా మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీని బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అంతలో సెకెండ్ వేవ్ రావడంతో మళ్లీ చిత్రీకరణకు బ్రేక్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే బ్యాలన్స్ పార్ట్‌ కోసం చిత్రీకరణను పున: ప్రారంభించి.. ఆ వెంటనే దాన్ని కూడా కంప్లీట్ చేసేశారు. ఇక, దాదాపుగా డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకే అంటు చిరు.. ఇటు చరణ్ వేరే సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు.

Producers Clarity about Acharya Movie Release Date

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో.. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాదు, దీన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని కూడా అధికారికంగా ప్రకటించారు.

ఇక, తాజాగా 'ఆచార్య' మూవీ విడుదల గురించి పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందనేదే వీటి సారాంశం. దీంతో మెగా అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ విడుదలపై చిత్ర యూనిట్ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటనను వదిలింది. ఇందులో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం లేదని పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తైందని వెల్లడించింది. అంటే ఫిబ్రవరి 4నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

'ఆచార్య' మూవీ కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X