ఆగిపోయిన సలార్ 2: ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య అలా.. ఇదిగో అసలైన క్లారిటీ
గతంలో కంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చే సినిమాల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోయింది. అందులోనూ సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలకు సీక్వెల్స్ కూడా తీస్తున్నారు. అలా ఇప్పటికే ఎన్నో మూవీలు వచ్చి సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న మరో సీక్వెల్ సినిమానే 'సలార్ 2'.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే 'సలార్'. ఇది రెండు భాగాలుగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ యూనిట్ ముందే తెలిపింది. అందుకు తగ్గట్లుగానే తగ ఏడాది మొదటి భాగాన్ని 'సలార్: సీజ్‌ఫైర్' పేరుతో విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్‌ను సాధించింది.

'సలార్: సీజ్‌ఫైర్' సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌గా 'సలార్: శౌర్వాంగ పర్వం' మూవీని తీస్తున్నారు. కానీ, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ చిత్రం షూట్‌ను మొదలు పెట్టినట్లు టాక్ వచ్చింది. దీంతో ఈ ఏడాదిలోనే ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా అనుకున్నారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్: శౌర్యాంగ పర్వం' మూవీ ఉన్నట్లుండి ఆగిపోయినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. హీరో, దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్లే ఈ చిత్రం నిలిచిపోయిందని చెబుతున్నారు. దీంతో ఇంతటి భారీ చిత్రం ఆగిపోయిందన్న వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.
'సలార్: శౌర్యాంగ పర్వం' మూవీ అర్థాంతరంగా ఆగిపోయిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా దీనిపై స్పందించింది. ఈ మేరకు సెట్స్‌లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ నవ్వుతూ దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. 'వాళ్లు నవ్వడం ఆపడం లేదు' అనే క్యాప్షన్ ఇచ్చింది. తద్వారా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. 'సలార్ 2' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. శ్రీయా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలను చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











