twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tuck Jagadish : నానికి ఊహించని మద్దతు.. వారికి వార్నింగ్.. అదంతా వాళ్ళ ఇష్టమే అంటూ!

    |

    నాని హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు జగదీష్ సినిమా గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మారని త్వరలోనే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ ద్వారా విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.. సెప్టెంబర్ 10వ తేదీ అంటే వినాయక చవితి రోజున ఈ సినిమాను డిజిటల్ వేదికగా విడుదల చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే రోజు థియేటర్లలో వస్తాము అని ప్రకటించిన లవ్ స్టోరీ నిర్మాత సహా తెలంగాణ ప్రాంత థియేటర్ యజమానులు డిస్ట్రిబ్యూటర్లు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాని సహా నిర్మాతలను కూడా టార్గెట్ చేశారు.

    ఆ తర్వాత క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేయగా దానికి సంబంధించిన సినిమా నిర్మాత పెద్ది హరీష్ మరో లేఖ విడుదల చేశారు. ఇప్పుడు అనూహ్యంగా నాని సినిమా కి ఊహించని మద్దతు లభించినట్లయింది.

    Esther Anil : పరువాల ఆరబోతతో రెచ్చిపోయిన వెంకటేష్ చిన్న కూతురు... వామ్మో నెవర్ బిఫోర్ అంతే!Esther Anil : పరువాల ఆరబోతతో రెచ్చిపోయిన వెంకటేష్ చిన్న కూతురు... వామ్మో నెవర్ బిఫోర్ అంతే!

    నిర్మాతల ఒత్తిడితో నాని కూడా

    నిర్మాతల ఒత్తిడితో నాని కూడా

    శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనపడటం లేదు. నిజానికి నాని వీ సినిమా విడుదల చేస్తున్న సమయంలోనే ఈ సారి కుదరలేదు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఖచ్చితంగా థియేటర్స్ లో కలుసుకుందాం అని అన్నారు. అయితే అనూహ్యంగా నిర్మాతల ఒత్తిడితో నాని కూడా సినిమాను డిజిటల్ కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు..

    నాలుగు కోట్లు ఎక్కువ పెంచి

    నాలుగు కోట్లు ఎక్కువ పెంచి

    అయితే అనూహ్యంగా మొన్న తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కలిసి పెట్టిన ప్రెస్మీట్లో ఈ సినిమా మంచి రేటు రాలేదనే ఉద్దేశంతోనే తిమ్మరసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని థియేటర్ ల గురించి గొప్పగా మాట్లాడి తమ సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తామని అన్నారు అని అందుకే అమెజాన్ ప్రైమ్ సంస్థ నాలుగు కోట్లు ఎక్కువ పెంచి ఇవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాను అమ్మేశారని ఆరోపించారు.

    పిరికి వాడని ఆరోపిస్తూ

    పిరికి వాడని ఆరోపిస్తూ

    అంతేకాక నాని సినిమాల్లో మాత్రమే హీరో కానీ బయట మాత్రం పిరికి వాడని ఆరోపిస్తూ అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఈ వ్యవహారం మీద నెటిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉండడంతో ఎట్టకేలకు క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు.

    అయితే ఈ మొత్తం వ్యవహారం గురించి స్పందిస్తూ తాము సినిమా తీసింది థియేటర్లలో విడుదల చేయడానికి అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా అమ్ముకోవాల్సి వచ్చిందని చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు నిర్మాతలు. ఆ సంగతి పక్కన పెడితే అయితే తాజాగా నానికి మద్దతుగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ లేఖ విడుదల చేస్తుంది.

    అంతా వాళ్ళ ఇష్టం

    అంతా వాళ్ళ ఇష్టం

    ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా మీద పూర్తి హక్కులు నిర్మాతకే ఉంటాయని సినిమా తీసేది ఆయనే కాబట్టి సినిమాలు ఆయన వల్లనే ప్రారంభమవుతాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ లేఖలో చెప్పుకొచ్చారు. సినిమా ఎవరికి అమ్ముకోవాలి అనేది నిర్మాత ఇష్టమని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తమ లేఖలో పేర్కొంది.

    అలాగే సినిమా ఎవరికి ఇచ్చుకోవాలి అనేది కూడా వారి ఇష్టమే అని చెప్పుకొచ్చారు. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది నిర్మాతలు మొదలు హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కలిసి పని చేస్తేనే సుఖంగా ఉంటుందని పేర్కొన్నారు..

    Recommended Video

    RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
    వార్నింగ్

    వార్నింగ్

    కరోనా కారణంగా థియేటర్లో యజమానులే కాక డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కూడా నష్టపోయారు అని అంతమాత్రాన నిర్మాతలు తమ సినిమాలను ఎవరికి ? ఎప్పుడు? ఎక్కడ? ఎలా అమ్ముకోవాలి అనే విషయాలను కూడా నిర్ధారించే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఇక్కడ ఒక్కొక్కరూ మరొకరికి సాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి తప్ప ఒకరి మీద ఒకరు ఆంక్షలు పెట్టే అధికారం లేదని లేఖలో పేర్కొన్నారు.

    ఇక ప్రొడ్యూసర్స్ గిల్డ్ లేఖ చూస్తే మాత్రం ఒకపక్క నాని సినిమా నిర్మాతలకు భరోసా ఇస్తూ ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాలి అన్నట్లుగా తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది

    English summary
    Producers guild releases a letter in favour of Tuck jagadish digital release today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X