Project K రిలీజ్ డేట్ ఫిక్స్.. 7 నెలల్లో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు.. ఇక బ్లాస్ట్ అవ్వాల్సిందే!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు అనుకున్న సమయానికి విడుదల కాలేదు. ఇక ఎలాగైనా నెక్స్ట్ నుంచి మాత్రం సరైన సమయంలో విడుదల చేయాలి అని రెడీ అవుతున్నాడు. ఇక మొత్తానికి ప్రాజెక్టు K కు సంబంధించిన విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక కేవలం 7 నెలల్లోనే ప్రభాస్ మూడు అతిపెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల కాబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

బిగ్ బడ్జెట్ సినిమాలు

బిగ్ బడ్జెట్ సినిమాలు

బాహుబలి సినిమా తర్వాత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమాతో పాటు రాధే శ్యామ్ రెండు కూడా తీవ్ర స్థాయిలో నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తదుపరి సినిమాలతో మాత్రం ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. గతంలో కంటే ఎక్కువ స్థాయి బడ్జెట్లోనే తదుపరి సినిమాలతో రాబోతూ ఉండడం విశేషం. అందుకు సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్

ఆదిపురుష్

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాలి. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా మళ్ళీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. విడుదలైన టీజర్ తీవ్రస్థాయిలో నిరాశపరచడంతో ఫాన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సినిమ గ్రాఫిక్స్ లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ సరికొత్తగా విడుదల చేయాలని రెడీ అయ్యారు. ఇక మొత్తానికి ఆదిపురుష్ సినిమాను ఈ ఏడాది జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

హై వోల్టేజ్ యాక్షన్ మూవీ..

హై వోల్టేజ్ యాక్షన్ మూవీ..

ఇక ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానుంది.

ప్రాజెక్ట్ K ఎప్పుడు

ప్రాజెక్ట్ K ఎప్పుడు

ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ K ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి శివరాత్రి సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీపై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. పోస్టర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను 2024 జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని వైజయంతి మూవీస్ అధికారికంగా పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు.

లైన్ లో మరో రెండు

లైన్ లో మరో రెండు

ఇక ప్రభాస్ ఈ మూడు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలను కూడా పూర్తి చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ కాన్సెప్ట్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో కూడా స్పిరిట్ అనే ఒక సినిమా చేయబోతున్నాడు. అందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక మారుతి డైరెక్షన్లో వచ్చే సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కావచ్చు. ఇక స్పిరిట్ సినిమా 2025లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X