Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరు ఇలాంటి సిల్లీ థింగ్స్ పట్టించుకోరు.. అనవసర రాద్ధాంతం.. పృథ్వీ కామెంట్స్
మెగా ఫ్యామిలీకి, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి మధ్య చాలా రోజులుగా మెగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా మెగా హీరోలంటే అభిమానించే పృథ్వీ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారాలు చేసి మెగా హీరోలతో వార్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు, మెగా బ్రదర్ నాగబాబుకు మధ్య పెద్ద మాటల యుద్ధం నడిచింది. అయితే ఆ వైరం కారణంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమాలో పృథ్వీ సీన్స్ కొన్ని తొలగించారనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గుప్పుమంటోంది.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై స్పందించిన పృథ్వీ.. చిరంజీవి ఇలాంటి సిల్లీ థింగ్స్ పట్టించుకోరని, చిరంజీవి అంటే తనకెంతో అభిమానమని అన్నాడు. గతంలో కూడా పృథ్వీని మెగా హీరోలు పక్కన పెట్టేస్తున్నారనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో నుంచి పృథ్వీ సీన్స్ లేపేశారని అన్నారు. అయితే ఆ సందర్భంలో వాటిపై రియాక్ట్ అయిన పృథ్వీ.. 'తాడేపల్లి గూడెం నుంచి మద్రాస్ వచ్చింది మెగా హీరోలు అవకాశం ఇస్తారని కాదు' అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ తాజాగా చిరంజీవి 'సైరా' విషయంలో మాత్రం పృథ్వీ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది సైరా నరసింహా రెడ్డి సినిమా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్నా, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. చూడాలి మరి 'సైరా' లో పృథ్వీ రోల్ ఏ మేర ఉంచుతారనేది.