పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త: PSPK 26 ప్రీ లుక్ రిలీజ్.. ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..
'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమై రాజకీయాలతో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన 26వ సినిమాతో బిజీగా ఉన్న పవన్.. అభిమానులు ఖుషీ అయ్యేలా సరికొత్త అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వివరాల్లోకి పోతే..

అభిమానుల కోరిక మేరకు పవన్..
జనసేన పార్టీ స్థాపించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్న ఆయన.. నిర్మాతలు, అభిమానుల కోరిక మేరకు తిరిగి వెండితెరపై కన్నేశారు. ఈ మేరకు బాలీవుడ్ మూవీ 'పింక్' రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పారు.

‘పవన్ కళ్యాణ్ లీడ్ రోల్.. దిల్ రాజు నిర్మాణం
హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘పింక్' సినిమాకు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..
ఇటీవలే సెట్స్ మీదకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పవన్ కెరీర్ లో 26వ సినిమాగా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాకు 'వకీల్ సాబ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్‌లుక్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

PSPK 26 ప్రీ లుక్ రిలీజ్
వారి ఎదురుచూపులను తెరదించేలా తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ ఫస్ట్‌లుక్ ఎప్పుడు రిలీజ్ కానుందో తెలిపారు యూనిట్ సభ్యులు. ఈ ప్రీ లుక్‌లో పవన్ అలా నడుస్తూ వెళ్తున్నట్లుగా చూపుతూ, లాయర్ టై సింబల్ చూపించారు. దీన్నిబట్టి చూస్తే సినిమాకు 'వకీల్ సాబ్' అనే టైటిల్ అయినట్లే అని తెలుస్తోంది.

ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..
ఏదేమైనా టైటిల్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ఫస్ట్‌లుక్ విడుదలతో తెరపడనుంది. ఈ మేరకు పవన్ అభిమానులకు శుభవార్త చెప్పింది చిత్రయూనిట్. ఈ మూవీ ఫస్ట్‌లుక్ రేపు (మార్చి 2) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
సమ్మర్ స్పెషల్.. రిలీజ్ డేట్
ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల కానుందని ఇటీవలే థమన్ ప్రకటించారు. ఇకపోతే మే 23న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్.


Click it and Unblock the Notifications











