Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
PSPK27 రిలీజ్ డేట్ ఫిక్స్.. మహేష్ బాబుతో బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్దమైన పవన్ కళ్యాణ్
సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి ఫెస్టివల్ చాలా ముఖ్యమైనది అని అందరికి తెలిసిన విషయమే. స్టార్ హీరోలనే కాకుండా మీడియం రేంజ్ హీరోలు కూడా కథలను నమ్మి సంక్రాంతి ఫైట్ కు సిద్ధమవుతుంటారు. అలాగే మినీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ సీజన్స్ ల్ పోటీ పడుతూ ఉండడం సహజమే. ఇక 2022 సంక్రాంతి ఫైట్ ఎలా ఉంటుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. గత సంక్రాంతికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫైట్ ఖరారైంది.
ట్రాక్ లోకి వచ్చిన బాక్సాఫీస్
కరోనా కారణంగా 2021 సంక్రాంతికి అసలు సినిమాలు క్లిక్కవుతాయా లేదా అనే అనుమానాలు ఎన్నో వచ్చాయి. కానీ మొత్తానికి బాక్సాఫీస్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది. క్రాక్ సినిమాతో పాటు రెడ్, మాస్టర్ సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఈ మూడు సినిమాలు కూడా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అంధించాయి. సంక్రాంతి ఎఫెక్ట్ వల్ల సినిమాలకు కలెక్షన్స్ భారీగానే వచ్చాయి.
గత సంక్రాంతి ఫైట్ లో బన్నీ మహేష్
గత ఏడాది సంక్రాంతికి ముందుగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మహేష్ కు మరో రికార్డును అందించింది. ఇక ఆ తరువాత రోజే అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో భారీ హైప్ తో విడుదలైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్ అందుకొని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలను అంధించాయి.
2022 సంక్రాంతి ఫైట్ లో పవన్ కళ్యాణ్
అయితే 2022 సంక్రాంతి ఫైట్ ఎలా ఉంటుందా అనే విషయం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ముందుగా మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చే సంక్రాంతికి రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ కొరటాల శివ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా సంక్రాంతికి రానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.
మహేష్ vs పవన్ కళ్యాణ్
మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు. ఈ ఇద్దరి హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగితే ఆ వాతావరణం మామూలుగా ఉండదు. మహేష్ సర్కారు వారి పాట కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ 27వ సినిమా 17శతాబ్దంలోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రానున్న పిరియాడిక్ మూవీ. రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ కాబట్టి తప్పకుండా రెండు హిట్టవుతాయని చెప్పవచ్చు.