PSPK Rana Movie: ఫ్యాన్స్‌కు పండుగ లాంటి న్యూస్.. రెండు నెలల్లోనే టార్గెట్ ఫినీష్
రీఎంట్రీలో ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ఆ వెంటనే మరికొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. విభిన్న తరహా చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర రూపొందిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆలస్యంగా ప్రకటించినా.. ముందే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు పవన్ కల్యాణ్. అయితే, చాలా వరకు షూటింగ్ పూర్తయిన తర్వాత కరోనా సెకెండ్ వేవ్ కారణంగా చిత్రీకరణను నిలిపి వేశారు. ఇక, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో షూట్‌ను పున: ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జూలై 11 నుంచి ఈ మూవీ షూటింగ్‌ను మొదలెట్టబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. అప్పటి నుంచి సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణను జరపబోతున్నారట. అంటే ఆగస్టు చివరి నాటికి టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయనున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా.. దగ్గుబాటి రానా లోకల్ డాన్‌గా నటిస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య జరిగే ఆధిపత్య పోరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











