PSPK28 movie update: గబ్బర్ సింగ్ రిలీజ్ రోజే మళ్లీ ఆ ఇద్దరితో
ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం రాబోయే కాలంలో తన ప్లానింగ్‌ను పక్కాగా డిజైన్ చేసుకొంటున్నారు. లాక్‌డౌన్ అనంతరం తనకు ఉన్న సమయాన్ని క్లారిటీతో ఉపయోగించుకొనేందుకు సిద్ధమవుతన్నారు. స్వీయ గృహ నిర్బంధంలోనే ఉంటూనే తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్టులో మార్పులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టిపెట్టారు.
వచ్చే ఏపీ ఎన్నికలలోపు వీలైనన్నీ సినిమాలను పవన్ కల్యాణ్ సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తన కెరీర్‌లో 28వ రానున్న చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపికను ప్రారంభించారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాను అందించిన హరీష్ శంకర్‌తో తన 28వ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పవన్28గా పేర్కొంటున్న సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వంతోపాటు సంగీత దర్శకత్వ బాధ్యతలను దేవీ శ్రీ ప్రసాద్‌కు అప్పజెప్పారు. దాంతో మళ్లీ గబ్బర్ సింగ్ టీమ్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి పేర్లను గబ్బర్ సింగ్ రిలీజై 8 ఏళ్లు అయిన సందర్భంగా ప్రకటించడం మరో విశేషం.
ఈ సందర్భంగా హరీష్ శంకర్ స్పందిస్తూ.. ఈ రోజు అద్భుతమైన రోజు. 8 ఏళ్ల క్రిత ఎనర్జీతో కూడిన సినిమా రిలీజ్ అయింది. అలాంటి మ్యూజిక్, అలాంటి మ్యాజిక్‌ను క్రియేట్ చేసేందుకు మళ్లీ కలిసి వస్తున్నాం. దేవీ శ్రీ ప్రసాద్ పవన్ కల్యాణ్ 28వ సినిమాకు సంగీతం అందిస్తున్నారు అని ట్వీట్ చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందే ఈ సినిమా కోసం హరీష్ శంకర్, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ చేతులు కలిపారు. పవన్ కల్యాణ్‌కు ఇది 28వ సినిమా అని యూనిట్ ఇటీవల ట్వీట్ చేసింది. త్వరలోనే నటీనటుల ఎంపికను అధికారికంగా ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











