రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో సీక్రెట్ పెళ్లి అంటూ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దేవిశ్రీప్రసాద్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఆయన పాతికేళ్ల కుర్రాడి తరహాలోనే కనిపించినప్పటికీ కూడా ఇప్పటికే నాలుగు బదులు వయసులోకి వచ్చేసారు. ఇక చాలా కాలంగా దేవిశ్రీప్రసాద్ పెళ్లిపై కూడా చాలా రకాల కథనాలు వెలబడుతున్నాయి. అయితే రీసెంట్ గా ఒక హీరోయిన్ స్పందించిన విధానంతో మరోసారి దేవి శ్రీ ప్రసాద్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 మొదట్లోనే బిగ్ మూవీస్

మొదట్లోనే బిగ్ మూవీస్

ప్రముఖ రైటర్ సత్యమూర్తి తనయుడిగా దేవిశ్రీప్రసాద్ ఇండస్ట్రీలోకి రాకముందే చాలా మంది సినీ ప్రముఖులకు తెలుసు. ఇక అతను చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకొని 12 ఏళ్ల వయసులోనే పాటలను కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక రెండు పదుల వయసులోకి రాకముందే దేవీ లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలకు కూడా మ్యూజిక్ అందించి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు.

అప్పట్లోనే రూమర్స్

అప్పట్లోనే రూమర్స్

దేవి శ్రీ ప్రసాద్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ట్యూన్స్ కంపోజ్ చేస్తూ ఉంటాడు. అయితే అతనికి పెళ్లి జరిగిపోయింది అని అలాగే కొంతమంది హీరోయిన్స్ బ్రేకప్ కూడా అయ్యింది అని గత పదేళ్లుగా మీడియాలలో అనేక రకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ విషయాలను దేవిశ్రీప్రసాద్ ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

గతంలోనే క్లారిటీ

గతంలోనే క్లారిటీ

గతంలో ఒక ప్రముఖ హీరోయిన్ తో కూడా దేవి క్లోజ్ గా ఉన్నాడు అని సోషల్ మీడియాలో కూడా టాక్ వైరల్ గా మారిపోయింది. వారిద్దరు ప్రేమలో ఉన్నట్లు కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత దేవి ఆ విషయంలో ఒకసారి క్లారిటీ ఇస్తూ.. తను ఇంకా పెళ్లికి తాను సిద్ధం కాలేదు అని ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కూడా మ్యూజిక్ ప్రపంచంలోనే ఉంది అంటూ దేవిశ్రీ వివరణ ఇస్తూ వస్తున్నాడు.

ఆ హీరోయిన్ రియాక్షన్

ఆ హీరోయిన్ రియాక్షన్


రీసెంట్ గా ఒక హీరోయిన్ ఇచ్చిన క్లారిటీతో మరోసారి దేవి పెళ్లికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆమె మరెవరో కాదు పూజిత పొన్నాడ. పలు తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న ఈ హీరోయిన్ ఊపిరి సినిమాలో ఒక క్యారెక్టర్ లో కనిపించి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత దర్శకుడు సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన పూజిత గ్యాప్ లేకుండా తెలుగు తమిళం సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

ఆ వార్తలు నిజం కాదు

ఆ వార్తలు నిజం కాదు

ఇక దేవి శ్రీ ప్రసాద్, పూజిత పెళ్లి సీక్రెట్ గా జరిగినట్లు, అలాగే రెండేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు అని ఇటీవల వచ్చిన వార్తలు మరింత వైరల్ కావడంతో పూజిత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె నటించిన ఆకాశవీధిలో అనే సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన పూజిత పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు అని తెలిపింది. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలన్ని కూడా అవస్తవమని ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X