సీక్రెట్‌గా పల్సర్ బైక్ సింగర్ ఎంగేజ్‌మెంట్ .. వధువు ఎవరంటే?

పల్సర్ బైక్ సాంగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రూతలూగించిన ఈ పాటకు స్టెప్పులు వేసిన కండెక్టర్ ఝాన్సీ ఎంత వైరల్ అయిందో ఆ పాట పాడిన సింగర్ రమణ కూడా అంతే వైరల్ అయ్యారు. ఒక్క పాటతోనే ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేశారు. అప్పటి వరకు ఎన్ని పాటలు పాడినా రాని ఫేమ్.. ఈ ఒక్క పాటతో వచ్చేసింది. ముఖ్యంగా ధమాకా సినిమాలోనూ ఈ పాట పెట్టడంతో మరింత వైరల్ అయిపోయారు. ఇలా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈయన తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

Pulsar Bike Song Singer Ramana Enguagement Photos Goes Viral

జానపద కళాకారుడు, పల్సర్ బైక్ రమణ.. కొత్త ఏడాది 2024లో పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో పిక్స్ అయిపోయాడు. ఈక్రమంలోనే గతేడాది డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. డిసెంబర్ నెల చివర్లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్న సింగర్ రమణ తాజాగా తనకు ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. రమణ చేసుకోబోయే అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. అమ్మాయి అందంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్లు.

Pulsar Bike Song Singer Ramana Enguagement Photos Goes Viral

అయితే రమణ చేసుకోబేయే అందాల తార పేరు కుందన శ్రీ. పేరుకు తగ్గట్లుగానే ఈ ముద్దుగుమ్మ కుందనపు బొమ్మలా ఉంది. ఈ వీడియోలే అందంగా ముస్తాబైన ఈ జంట స్టేజీపై అంతా చూస్తుండగా.. ఉంగరాలు మార్చుకున్నారు. దానితో పాటుగానే ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కూడా పూర్తి చేసుకున్నట్లు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. గతంలో బేబీ సినిమా రేంజ్ బ్రేకప్ స్టోరీ కల్గిన రమణ.. పెళ్లి చేసుకోవడంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ దీవిస్తున్నారు.

Pulsar Bike Song Singer Ramana Enguagement Photos Goes Viral

జానపద కళాకారుడిగా మంచి పేరు తెచ్చుకున్న రమణ... పల్సర్ బైక్ పాటతో పాటు పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మ వంటి పాటను ఓ టెలివిజన్ షోలో పాడి మరింత ఫేమస్ అయిపోయాడు. కేవలం పాటలు మాత్రమే కాకుండా రెండు షార్ట్ ఫిల్మ్స్ ను కూడా తెరకెక్కించాడు. బేబీ అనే షార్ట్ ఫిల్మ్ ను తన రియల్ స్టోరీ ఆధారంగానే తీసినట్లు కూడా వివరించాడు. ఇదంతా ఇలా ఉండగా.. ఎంతో గ్రాండ్ గా చేసుకున్న ఎంగేజ్ మెంట్ సంబంధించిన వీడియోను మీరూ ఓసారి చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X