హాట్‌గా కనిపించడానికి పునర్నవి గ్రీన్ సిగ్నల్.. కానీ ఎంత ఇచ్చినా అలాంటి వాటికి ఒప్పుకోదట!

పునర్నవి భూపాలం.. చేసింది చిన్న తరహా పాత్రలే అయినా ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. ఓ విధంగా కెరీర్ కి సరిపడేంత క్రేజ్ ని అందుకుందనే చెప్పాలి. అంతకుముందు వరకు కేవలం ఒక సపోర్టింగ్ యాక్టర్ గానే జనాలకు తెలుసు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు పున్ను బేబి ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మొదటి సినిమాలో పక్కింటి అమ్మాయిలా మెరిసిన యంగ్ యాక్టర్ అసలు ఈ రేంజ్ లో క్లిక్కవుతుందని ఎవరు అనుకోలేదు.

 న్యూ పునర్నవి..

న్యూ పునర్నవి..

నేటి జనరేషన్ సినిమా ప్రపంచంలో చాలా వరకు నటీమణులు ట్రెండ్ కి తగ్గట్టు మారిపోతుంటారు. రోజేరోజుకి గ్లామర్ డోస్ ఎక్కువగానే కనిపిస్తుంది. అదే తరహాలో పునర్నవి కూడా కెరీర్ మొదట్లో కనిపించినట్లుగా ఇప్పుడు కనిపించడం లేదు. స్టైలిష్ డ్రెస్సులతో తనదైన శైలిలో గ్లామర్ బ్యూటీగా కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. అసలు పునర్నవి ఇలా కనిపిస్తుందని బిగ్ బాస్ షో ముందు వరకు ఎవరు ఊహించలేదు.

వైరల్ ఫిక్స్..

వైరల్ ఫిక్స్..

ఆ మధ్య యోగా చేస్తూ ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ బిగ్ బాస్ బ్యూటీ ఇంటర్నెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఉయ్యాల జంపాల సినిమాలో అమాయకంగా కనిపించిన పునర్నవికి ఇప్పుడు కనిపిస్తున్న పునర్నవికి తేడానే లేదనే కామెంట్స్ వచ్చాయి. ఆమె ఎలాంటి ఫొటోస్ షేర్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బోల్డ్ పాత్రలకు..

బోల్డ్ పాత్రలకు..

బిగ్ బాస్ కంటే ముందు వరకు పెద్దగా క్రేజ్ లేదు. ఆ తరువాత షోలో చేసిన హడావుడికి బాగానే క్రేజ్ అందుకుంది. స్టార్ సెలబ్రెటీగా కాకపోయినా జనాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. ఇక బ్యూటీకి ఈ మధ్య కొన్ని బోల్డ్ పాత్రల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసిందట. హద్దులు దాటకుండా కాస్త హాట్ గా కనిపిస్తే పరవలేదంటూ.. అయితే అలాంటి పాత్రలకు కథలో పెద్దగా ఇంపార్టెంట్ లేకపోతే మాత్రం డైరెక్ట్ గా చేయనని చెప్పేస్తోందట. కొన్ని ఆఫర్స్ కోసం అమ్మడికి మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ ఒప్పుకోలేదని టాక్ వస్తోంది.

Recommended Video

Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!
న్యూ ప్లాన్..

న్యూ ప్లాన్..

కెరీర్ ప్లాన్ చేసుకోవడంపై పునర్నవి ఈ లాక్ డౌన్ లో చాలానే ఆలోచించిదట. బిగ్ బాస్ షోలో రాహుల్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు లవ్ లో ఉన్నట్లు ఒకానొక సమయంలో రూమర్స్ వచ్చాయి. కానీ పునర్నవి మాత్రం ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. సపోర్టింగ్ రోల్స్ కథలో స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమాల్లో నటించాలని పున్ను ఒక కొత్త ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇంతవరకు పెద్దగా అవకాశాలు అందుకోని ఈ బ్యూటీ భవిష్యత్తులో ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X