పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పునర్నవి.. ప్రేమ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ తగ్గలేదు!

పునర్నవి భూపాలం.. అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. చేసింది చిన్న పాత్రలే అయినా అమ్మడు బిగ్ బాస్ షో ద్వారా కెరీర్ కి సరిపడేంత క్రేజ్ ని అందుకుంది. హౌజ్ లో ఉన్నన్ని రోజులు అమ్మడు ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. టీనేజ్ వయసు నుంచే పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఈ యంగ్ యాక్టర్ అసలు ఈ రేంజ్ లో క్లిక్కవుతుందని ఎవరు ఊహించలేదు.

 ఎవరు ఊహించని పునర్నవి..

ఎవరు ఊహించని పునర్నవి..

ఫ్యాషన్ వరల్డ్ లో చాలా వరకు నటీమణులు ట్రెండ్ కి తగ్గట్టు మారిపోతుంటారు. ఇక సినీ వరల్డ్ లో అయితే ఆ డోస్ ఎక్కువగానే కనిపిస్తుంది. అదే తరహాలో పునర్నవి కూడా కెరీర్ మొదట్లో కనిపించినట్లుగా ఇప్పుడు కనిపించడం లేదు. హాట్ డ్రెస్సులతో తనదైన శైలిలో గ్లామర్ గర్ల్ లా దర్శనమిస్తోంది. అసలు అమ్మడు ఈ రేంజ్ లో షాకిస్తుందని ఎవరు ఊహించలేదు.

ఫొటోస్ వైరల్..

ఫొటోస్ వైరల్..

ఆ మధ్య యోగా చేస్తూ ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన పున్ను బేబి సోషల్ మీడియాలో కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. అసలు ఇందులో ఉన్నది ఉయ్యాల జంపాల సినిమాలో కనిపించిన ఆ అమ్మాయేనా అనేలా పునర్నవి తన గ్లామర్ ని పాజిటివ్ గా ప్రజెంట్ చేసింది. ఆమె ఎలాంటి ఫొటోస్ షేర్ చేసినా కూడా ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి.

 ఎంత కష్టపడినా..

ఎంత కష్టపడినా..

బిగ్ బాస్ ముందు వరకు పెద్దగా క్రేజ్ అందుకొని పునర్నవి ఆ తరువాత షోలో చేసిన రచ్చకు ఒక్కసారిగా స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది. రాహుల్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వైరల్ అయ్యింది. వారిద్దరు లవ్ లో ఉన్నట్లు ఒకానొక సమయంలో రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ రూమర్స్ ని అమ్మడు పట్టించుకోలేదు.

Recommended Video

Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!
పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది..

పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది..

ఇక మొన్నటి వరకు పెళ్లి విషయంలో కూడా ఎన్ని రూమర్స్ వచ్చినా పెద్దగా స్పందించని ఈ బిగ్ బాస్ బ్యూటీ లవ్ లో ఉందా లేదా అనే విషయంపై ఇంకా సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. పెళ్లి గురించి అయితే ఇప్పట్లో ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదని ఇటీవల పునర్నవి క్లారిటీ ఇచ్చింది. పెళ్లి కంటే ముందు ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని రూమర్స్ కి చెక్ పెట్టె ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X