twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వయసులో పుట్టే కోరికలు చాలా ఇష్టం.. కాబోయే వాడు ఇలా ఉండాలి: పునర్నవి

    |

    బిగ్ బాస్ షో ద్వారా సరికొత్తగా దర్శనమిచ్చిన పునర్నవి భూపాలం ఎప్పటికప్పుడు ఆడియెన్స్ కి ఉహీంచని షాక్ లు ఇస్తోంది. అందంతోనే కాకుండా ఆమె మాటలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అమ్మడు పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. అలాగే ప్రేమ గురించి భవిష్యత్తు ప్రాణాళికల గురించి క్లుప్తంగా వివరించింది.

     సోషల్ మీడియాలో వైరల్..

    సోషల్ మీడియాలో వైరల్..

    బిగ్ బాస్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ బ్యూటీ రేంజ్ పెరిగిపోయింది. అలాగే పునర్నవి తనలోని కొత్త షేడ్స్ ని బయటపెట్టడంతో మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. పునర్నవికి సంబంధించిన న్యూస్ వస్తే చాలు నెటీజన్స్ అసలు విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

     ఆ వయసులో పుట్టే ప్రేమ..

    ఆ వయసులో పుట్టే ప్రేమ..

    ఇక ఇటీవల పునర్నవి ప్రేమ కోరికలపై కొన్ని కామెంట్స్ చేసింది. 18-19 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమ చాలా స్వఛ్చమైనది అని కోరికలు కూడా స్వచ్ఛంగా ఉంటాయని చెప్పింది. చాలా సింపుల్ గా ఉండే.. ఓల్డ్ అథంటిక్ లవ్ అంటేనే తనకు చాలా ఇష్టమని.. ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకుంటేనే బావుంటుందని తెలిపింది.

     ఆ ప్రేమ దొరకడం లేదు..

    ఆ ప్రేమ దొరకడం లేదు..

    ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ దొరకడం లేదు అంటూ.. అందుకు గల ఒక కారణాన్ని చెప్పింది. టెక్నాలజీ పెరిగిపోయింది. అలాగే సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ కారణంగా చాలా మంది కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. నిజమైన ప్రేమ అనేది దొరకడం కష్టంగా మారింది. అలాగని దొరకదని కాదు. నాకు ఒక మంచి ప్రేమ దొరుకుంది అనే నమ్మకం ఉంది.

     కాబోయే వాడు ఇలా ఉండాలి..

    కాబోయే వాడు ఇలా ఉండాలి..

    నేను పెళ్లి చేసుకునే వాడు ముందుగా నన్ను భరించగలగాలి. బిగ్ బాస్ ద్వారా నాలో ఆరు షేడ్స్ మాత్రమే చూశారు. కానీ నాలో ఇంకా 70 ఉన్నాయి. నన్ను అర్థం చేసుకొని భరించగలగాలి. అలాగే నేను పెళ్లి తరువాత కూడా ఇలానే ఉంటాను. నాకు నచ్చిన పని చేస్తాను. ఇండిపెండెంట్ ఉమెన్‌గా ఉండాలన్నదే నా కోరిక.

    పెళ్లి కంటే ముందు..

    పెళ్లి కంటే ముందు..

    జోవియల్‌గా, పాజిటివ్‌గా ఉంటేనే నాకు ఇష్టం. తను కూడా ఉండాలి. మొత్తంగా నేను ఏ పని చేసిన యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఇక పెళ్లి కంటే ముందు చదువు పూర్తి చేయాలి. పెళ్లి చేసుకోవడానికి ఇంకా 6 నుంచి 7 సంవత్సరాల సమయం పట్టవచ్చు. అంతవరకు చదువు కెరీర్ పైనే దృష్టి పెడతాను.

    Recommended Video

    Rahul Sipligunj New Look Shocks His Fans
    పెళ్లి తరువాత దూరంగా..

    పెళ్లి తరువాత దూరంగా..

    ఇక పెళ్లి చేసుకోవాల్సిన సమయం వస్తే.. ఆలోచన రాగానే నచ్చినవాడు దొరికితే చేసేసుకుంటా. ఇక పెళ్లి తరువాత సిటీకి దూరంగా ఉంటాను. ఇద్దరు పిల్లలు చాలు. ఈ విధంగా సింపుల్ గా బ్రతకాలన్నది నా కోరిక. అయితే ఇవన్నీ జరగడానికి మరో 20 ఏళ్ల సమయం పట్టవచ్చని పునర్నవి వివరణ ఇచ్చింది. ఇక ఆమె పెళ్లిపై, ప్రేమపై వస్తున్న పుకార్లకు ఈ కామెంట్స్ తో చెక్ పెట్టినట్లు అర్ధమవుతోంది.

    English summary
    In the fashion world, most actresses adapt to the trend. But in the cine world, the dose is higher. Punarnavi bhupalam along the same lines do not look like they were at the beginning of a career. Glamor Girl Law appears in her own style with hot dresses. Who did not expect the original to be in this range.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X