బిగ్ బాస్ హౌస్‌లో తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఉయ్యాల జంపాల నటి

గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.

100 రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో తొమ్మిదో కంటెస్టెంట్‌గా 'ఉయ్యాల జంపాల' ఫేమ్ పునర్ణవి భూపాలం అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్‌లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. పునర్ణవి గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

Punarnavi Bhupalam Enters Into the Bigg Boss House

'ఉయ్యాల జంపాల' సినిమా ద్వారా పునర్ణవి భూపాలం తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాలోనే చక్కని నటన కనబరిచి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది' సహా పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం చూస్తోంది. ఈలోగా ఈ రియాలిటీ షోలో అవకాశం రావడంతో ఇటు వచ్చేసింది. నాగ్ ఆమెను లోపలికి పంపించగా, ముందుగా వెళ్లిన కంటెస్టెంట్లు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X