పవర్‌స్టార్‌తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ మూవీ.. క్రేజీ టైటిల్ కూడా ఖరారు..

కేజీఎఫ్‌ చాప్టర్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్‌ జాతకమే మారిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ దశలో ఉండగానే స్టార్ హీరోలు ఆయనతో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. కేవలం కన్నడ పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు ఆయనతో పనిచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ఆయనతో పనిచేయడానికి కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సిద్ధమయ్యారు.

మార్చి 17వ తేదీన జన్మదినం జరుపుకొన్న పునీత్ రాజ్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పనిచేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుందనే స్పష్టం చేశారు. కేజీఎఫ్ లాంటి డైరెక్టర్‌తో ప్రతీ ఒక్కరు పనిచేయాలని కోరుకొంటారు. చాలాకాలంగా కథపై చర్చలు జరుపుతున్నాం. ఆ సినిమాకు ఆహ్వాన అనే టైటిల్ కూడా ఖరారు చేశాం అని పునీత్ వెల్లడించారు.

Puneeth Rajkumar joins hands with Prashanth neel for Aahvaana project

ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ యువరత్న అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా డైలాగ్ టీజర్‌ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ఆయన సరసన సాయేషా హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమలోకి ఆమె అడుగుపెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X