twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండో వారంలోనే ఓటీటీలోకి పవర్ స్టార్ మూవీ: ఆ కారణంగానే అంటూ ప్రకటించిన నిర్మాత

    |

    ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ప్రవేశించినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ కన్నడంలో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. మరే హీరోకూ దక్కని విధంగా వరుస విజయాలను అందుకుంటోన్న అతడు.. చాలా కాలంగా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'యువరత్న' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులోనూ ఆకట్టుకుంది. అయినప్పటికీ.. దీన్ని ఓటీటీలో విడుదల చేసేశారు.

    సంతోష్ అనంద్‌రామ్ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ నటించిన చిత్రమే 'యువరత్న'. ఏప్రిల్ 1న ఈ చిత్రం కన్నడం, తెలుగు భాషల్లో విడుదలైంది. మన దగ్గర మంచి స్పందనను అందుకోలేకపోయినప్పటికీ.. మాతృ భాషలో మాత్రం సూపర్ సక్సెస్ అయింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ గురువారమే ఓ ప్రకటనను విడుదల చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అందులో పేర్కొన్నారు నిర్మాతలు.

    Puneeth Rajkumars Yuvarathnaa OTT Streaming Start

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'యువరత్న'లో విద్యా సంస్థలో ఉన్న లోటుపాట్లను వేలెత్తి చూపడంతో పాటు విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అవుతోన్న తీరును చూపించారు. రెండు విభిన్నమైన పాత్రల్లో పునీత్ రాజ్‌కుమార్ అద్భుతంగా నటించాడు. అలాగే, అతడికి పోటీగా ప్రకాశ్ రాజ్ కూడా అదరగొట్టేశాడు. మొత్తానికి మంచి మెసేజ్‌తో సాగిన ఈ చిత్రాన్ని KGF వంటి భారీ హిట్‌ను అందించిన హోంబళే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో పునీత్‌కు జోడీగా సాయేషా సైగల్ నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

    English summary
    Puneeth Rajkumar is an Indian film actor, playback singer, anchor and producer who works primarily in Kannada cinema. He has been a lead actor in 28 films; as a child, he appeared in films featuring his father, Rajkumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X