Puneeth Rajkunar పూర్తి చేయని బిగ్ బడ్జెట్ సినిమాలు.. ఇప్పుడు వాటి పరిస్థితేంటి?

కన్నడ పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా విషాదానికి లోను చేసింది. ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా గుండెపోటుకు గురవ్వడం సినీ ప్రముఖులు కూడా ఎంతగానో కలిచివేసింది.

దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర సినీ ప్రముఖులు అందరు కూడా పునీత్ రాజ్ కుమార్ మృతి పై తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయాయి. వాటి పరిస్థితి ఏమిటి అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కూడా మారుతుంది.

నిర్మాతలకు అండగా..

నిర్మాతలకు అండగా..

పునీత్ రాజ్ కుమార్ ఎలాంటి సినిమాలు మొదలు పెట్టినా కూడా వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలని అనుకుంటాడు. అంతేకాకుండా నిర్మాతలకు వర్క్ విషయంలో ఎంతగానో మద్దతు ఇస్తూ కష్టపడి పని చేస్తూ ఉంటాడు. చాలా సార్లు సినిమాలు నష్టపోయిన కూడా తన రెమ్యూనరేషన్ ను వెనక్కు తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీలైనంత వరకు సినిమా సక్సెస్ అవ్వాలని గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు.

అభిమానులతో ఆప్యాయంగా..

అభిమానులతో ఆప్యాయంగా..

సీనియర్ హీరో రాజ్ కుమార్ వారసుడు అయినప్పటికీ కూడా పునీత్ రాజ్ కుమార్ చాలా సింపుల్ గానే అందరితో ఫ్రెండ్లిగా ఉంటూ వచ్చాడు. ఇక తొందరగానే తనకంటూ ఒక స్టార్ మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. రీమేక్ సినిమాలు చేసినప్పటికీ కూడా తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తూ కన్నడ అభిమానుల ప్రేమను సంపాదించుకున్నాడు. అభిమానులంటే కూడా అతనికి ఎంతో అప్యాయత. ఎవరు కలవడానికి వచ్చినా కూడా వారితో కలిసి భోజనం చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ కారణంగానే కన్నడ సినీ ప్రేమికులు. పునీత్ రాజ్ కుమార్ ను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు.

భారీగా బందోబస్తు

భారీగా బందోబస్తు

అయితే పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మృతి చెందడంతో కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. దాదాపు కర్ణాటక రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. దాదాపు సినిమా థియేటర్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. అంతేకాకుండా పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన విక్రమ్ హాస్పిటల్ చుట్టూ భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

 పునీత్ పూర్తి చేయాల్సిన సినిమాలు

పునీత్ పూర్తి చేయాల్సిన సినిమాలు

అయితే పునీత్ రాజ్ కుమార్ మృతి చెందడంతో ఆయన పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ఒక సినిమా దాదాపు తుది దశకు చేరుకోగా మరొక సినిమా అయితే మధ్యలోనే ఆగిపోయింది. ఈ రెండు సినిమాలపై కూడా భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నటుడు మొన్నటివరకు చేతన్ కుమార్ దర్శకత్వంలో జేమ్స్ షూటింగ్‌ లో బిజీగా కనిపించాడు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తి చేశాడు. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తోంది. డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

Recommended Video

Hero Srikanth Released Poison Movie Song
వాళ్ళతో కూడా సినిమాలు చేయాలని..

వాళ్ళతో కూడా సినిమాలు చేయాలని..

ఇక పునీత్ ద్విత్వ అనే బిగ్ బడ్జెట్ సినిమాని కూడా ఫినిష్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. నవంబర్ లో లేదా డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించారు. పవన్ కుమార్ ఆ సినిమాకు దర్శకుడు.

ఆ దర్శకుడి పుట్టినరోజు కూడా ఇదే రోజు. ఇక సంతోష్ ఆనంద్‌రామ్‌ దర్శకత్వంలో కూడా పునీత్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రాజకుమార, యువరత్న మంచి ఫలితాన్ని అందుకున్నాయి. అంతే కాకుండా పునీత్ తన హోమ్ బ్యానర్‌లో ఐదు సినిమాలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X