twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sidhu Moose Wala: పంజాబీ సింగర్ దారుణ హత్య.. దుండగుల దాడితో రాజకీయ కోణం?

    |

    ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దు మూసే వాలా దారుణమైన హత్యకు గురి కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను గత కొంతకాలంగా రాజకీయాల్లో కూడా బిజీగానే ఉంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సిద్దు హత్యకు గురికావడంతో పంజాబ్ రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. సిద్దును తుపాకీతో కాల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఘటన ఎలా జరిగింది.. అనే వివరాల్లోకి వెళితే..

     తప్పించుకునేందుకు ఛాన్స్ లేకుండా..

    తప్పించుకునేందుకు ఛాన్స్ లేకుండా..

    ఆదివారం రోజు 28 ఏళ్ల సిద్ధూ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళుతుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు సిద్దుకు ఎలాంటి ఛాన్స్ దొరకలేదు. దుండగులు ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఒకేసారి బుల్లెట్ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. సిద్దు తో పాటు అతని స్నేహితులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.

    కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి

    కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి

    సిద్దు అసలు పేరు శుబ్ దీప్ సింగ్ సిద్ధూ.. గత కొంతకాలంగా అతను కాంగ్రెస్ రాజకీయాలతో కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు. అయితే ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో అతను ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను కాంగ్రెస్ ను ఏ మాత్రం విడువకుండా అదే తరహాలో ఎలక్షన్స్ కు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వస్తున్నాడు.

    విఐపి సంస్కృతికి తెర దించుతూ..

    విఐపి సంస్కృతికి తెర దించుతూ..

    అయితే రీసెంట్ గా విఐపి సంస్కృతికి తెర దించుతూ చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా పోలీసు భద్రతలను ఉపసంహరిస్తూ పంజాబ్ రాష్ట్రం ఇటీవల కొత్త నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే సిద్ధూ దారుణంగా హత్యకు గురికావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఈ విషయంలో రాజకీయ కోణంలో ఉండవచ్చని అనుమానాలు వస్తున్నాయి.

    బుల్లెట్ల వర్షం

    బుల్లెట్ల వర్షం

    సిద్దు తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని తన సొంత ఊరికి వెళుతుండగా మార్గమధ్యంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు మధ్యలో ఆపి ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇక సిద్ధూ కూర్చున్న సీట్లోనే బుల్లెట్ల తాకిడికి అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పటికే తోటి స్నేహితులు కూడా కొంత గాయపడ్డారు. ఇక వారు సిద్దును సమీప ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పటికీ అతను గాయపడినప్పుడే చనిపోయినట్లుగా వైద్యులు వివరణ ఇచ్చారు.

    అలాంటి ఆరోపణలు

    అలాంటి ఆరోపణలు

    పంజాబీ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి సింగర్ గా గుర్తింపు అందుకున్న సిద్ధూ ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు అతను ఎక్కువగా అతను పాటలలో కొన్ని హింసను ప్రేరేపించేలా మారణాయుధాలను చూపిస్తాడు అని ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే 2020లో AK 47 రైఫీల్ ని ఉపయోగించినట్లు సిద్దుపై పలు కేసులు నమోదయ్యాయి.

    Recommended Video

    Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
     అలా మంచి క్రేజ్

    అలా మంచి క్రేజ్

    బాంబిహా బోలె, 47 పాటలతో సిద్దు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో కూడా అతని పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే కొన్ని చిత్రాలలో కూడా నటించాడు. ఇక సిద్దు మరణించడంతో సినీ ప్రముఖులు గాయకులు అలాగే రాజకీయ నాయకులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Punjabi singer Sidhu Moose Wala was shot dead by unidentified assailants
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X