twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిస్టిబ్యూటర్ల లైగ‌ర్ పంచాయితీ.. చేతులెత్తేసిన పూరీ కనెక్ట్స్?

    |

    ఒక సినిమా విడుద‌లై విజ‌యం సాధిస్తే అంద‌రూ సంతోషంగా ఉంటారు. పెట్టుబ‌డి పెట్టిన‌వారికి డ‌బ్బు తిరిగొస్తుంది. ప్రాంతాల‌వారీగా సినిమాను కొనుగోలు చేసిన బ‌య్య‌ర్లు.. ఇలా నిర్మాతల నుంచి థియేటర్ల వరకు ఏయే విభాగాల్లో పెట్టుబ‌డి పెట్టారో ఆయా విభాగాల నుంచి డ‌బ్బులు వ‌చ్చేస్తాయి. ఒక సినిమా విడుద‌లై ప‌రాజ‌యం పాలైన‌ప్పుడు మాత్రం దీనికి విరుద్ధంగా జ‌రుగుతోంది. సినిమా ఫెయిలైతే ఎక్కువ‌గా బ‌య్య‌ర్లే న‌ష్ట‌పోతున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్య‌త నిర్మాత‌ల‌పైనే ఉంటుంది. లైగర్ సినిమాతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదం విషయాల్లోకి వెళితే..

     లైగర్... భారీ డిజాస్టర్

    లైగర్... భారీ డిజాస్టర్

    లైగ‌ర్ సినిమా ఎన్ని అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైందో మ‌నంద‌రికీ తెలిసిందే. కానీ అంచ‌నాల్ని అందుకోలేక ఆ సినిమా భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఎక్కువ‌గా బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోయారు. వీరిని ఆదుకుంటామ‌ని పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి చెప్పారంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయికానీ అవ‌న్నీ అవాస్త‌వాలంటున్నారు. బ‌య్య‌ర్ల‌ను ఆదుకుంటామ‌ని నిర్మాత‌లు ఎటువంటి హామీ ఇవ్వ‌లేద‌ని, వాటితో త‌మ‌కు ఎటువంటి సంబంధం లేన‌ట్లుగా ఉంటున్నారంటూ వార్త‌లు వస్తున్నాయి.

    మొదట్లో సిద్ధమైనా.. తర్వాత వెనకడుగు

    మొదట్లో సిద్ధమైనా.. తర్వాత వెనకడుగు

    బయ్యర్ల ఒత్తిడి మేరకు మొద‌ట్లో పూరీ, చార్మి సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత పూరీ క‌నెక్ట్స్ కార్యాల‌యం కూడా చేతులెత్తేసిందని, న‌ష్టం భ‌రించ‌డానికి సిద్ధంగా లేద‌ని తెలుస్తోంది. కొనుగోలు చేసి మీరు న‌ష్ట‌పోయారు.. అలాగే పెట్టుబ‌డి పెట్టి సినిమా తీసి తాము కూడా న‌ష్ట‌పోయామ‌ని చెప్పినట్లు సమాచారం. కొంత‌మంది బ‌య్య‌ర్లు పూరీ జ‌గ‌న్నాథ్‌తో క్లోజ్ గా ఉంటార‌ని, వీరు ఆయ‌న్ను రిక్వెస్ట్ చేయగా ఇప్పుడు కాక‌పోతే త‌ర్వాత సినిమాకైనా న్యాయంచేస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొనుగోలు చేసిన‌వారంతా న‌ష్ట‌పోయారు.

     చాంబర్ పై ఒత్తిడి

    చాంబర్ పై ఒత్తిడి

    బ‌య్య‌ర్లంద‌రూ హైద‌రాబాద్ ఫిలిం చాంబ‌ర్‌ను ఆశ్ర‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఏదో ఒక విధంగా త‌మ డ‌బ్బులు ఇప్పించాలంటూ ఛాంబ‌ర్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారంటున్నారు. వీరంతా హైద‌రాబాద్‌లో తాజాగా ఒక‌చోట స‌మావేశ‌మ‌య్యారు. ముందుగా పూరీ జ‌గన్నాథ్ కార్యాల‌యంలో కూర్చొని సెటిల్ చేసుకోవాల‌ని ఛాంబ‌ర్ పెద్ద‌లు చెప్పారని, వీలుకాక‌పోతే తర్వాత చూద్దాములే.. అన్నారని ఒక బయ్యరు చెప్పారు. పూరీ జగన్నాథ్, ఛార్మి ఏం చేస్తారో చూడాలి.!!

    English summary
    We all know that the film Liger was released amid many expectations.But the movie failed to meet the expectations and turned out to be a huge disaster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X