పూరీ జగన్నాథ్ క్యాంప్ నుంచి మరో దర్శకుడు.. క్రైమ్ థ్రిల్లర్‌తో మణిరాజ్ డైరెక్టర్‌గా
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్యాంప్ నుంచి మరో దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవ్వబోతున్నారు. పూరీ కనెక్ట్స్‌లో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరైనా మణిరాజ్ మెగా ఫోన్ పట్టుకొన్నారు.
పృథ్విరాజ్, అనూ మెహతా హీరోహీరోయిన్లుగా పీఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా సినిమా రూపొందుతున్నది.

దోపిడి కథా నేపథ్యంగా క్రైమ్ థ్రిల్లర్‌గా ఓ కొత్త చిత్రం రూపొందుతున్నది. ఈ మూవీ ద్వారా పీ మణిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పీ నాగమణి సమర్పణలో ప్రవీణ శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
చిత్ర దర్శకుడు పీ మణిరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... 27 రోజులపాటు వికారాబాద్, హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరించాం. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. హీరో పృథ్విరాజ్, హీరోయిన్ అనూ మెహతా చక్కగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ పూర్తి సహకారం అందించారు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబరు నెలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే టైటిల్, ఫస్ట్ విడుదల చేస్తాం అని అన్నారు.
నటీనటులు: పృథ్విరాజ్, అనూ మెహతా
సమర్ఫణ: పీ నాగమణి
బ్యానర్: పీఎస్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాత: ప్రవీణ శివరాజ్
దర్శకత్వం: పీ మణిరాజ్
సినిమాటోగ్రఫి: పరశురామ్ ఎరుగదిండి
ఎడిటర్: సి. అక్షయరాజ్
పీఆర్వో: శ్రీను-సిద్ధు


Click it and Unblock the Notifications











