Balakrishna Unstoppable మహేష్, అల్లు అర్జున్ తర్వాత.. షోలోకి మరో స్టార్ హీరో, డైరెక్టర్

ఇటీవల కాలంలో స్టార్ హీరోలలో అందరికంటే ఎక్కువగా మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది మాత్రం నందమూరి బాలకృష్ణ గారు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన అఖండ సినిమాతో పాటు బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటూన్నాడు. మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సరికొత్తగా అన్‌స్టాపబుల్‌ విత్ NBK అనే ఒక టాక్ షోను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఎంతో సరదాగా కొనసాగిన ఆ టాక్ షో ద్వారా బాలయ్య బాబు తన అభిమానుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. ఇక అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి హీరోలే కాకుండా త్వరలోనే మరో స్టార్ హీరో కూడా ఈ షోలో కి రాబోతున్నట్లు తెలుస్తోంది.

 బాలయ్య స్నేహం..

బాలయ్య స్నేహం..

నందమూరి బాలకృష్ణకు ఎంత కోపం ఉన్నా కూడా వెంటనే కూల్ అయిపోతారు అని ఆయనకు దగ్గరగా ఉండేవారు చెబుతూనే ఉంటారు. ఇక మిగతా హీరోలతో కూడా బాలయ్య బాబు ఎంత స్నేహంగా ఉంటారో అన్‌స్టాపబుల్‌లో విత్ NBK టాక్ షో ద్వారా చాలా క్లారిటీ గా అర్థమైపోయింది. గెస్ట్ ఎవరైనా సరే చాలా ఎనర్జీ గా ఉండేలా బాలయ్య బాబు వారిని మార్చేస్తు ఉంటారు.

 కాంట్రవర్సి విషయాలను కూడా..

కాంట్రవర్సి విషయాలను కూడా..


మంచు ఫ్యామిలీ తో మొదలైన బాలయ్య బాబు టాక్ షో ఇటీవల రానా దగ్గుబాటి వరకు విజయవంతంగా కొనసాగింది. దర్శకుడు రాజమౌళి బోయపాటి శ్రీనివాస్ అలాగే మరికొంత మంది సంగీత దర్శకులు కూడా బాలయ్య బాబు టాక్ షోలో ఎంతో సంతోషంగా పాల్గొన్నట్లు అర్థమయింది. ఇక గెస్త్యులను కేవలం ఆటపట్టించడమే కాకుండా కాంట్రవర్సి విషయాలను కూడా బాలయ్యబాబు చాలా ఓపెన్ గా అడగడం విశేషం.

టాలెంటెడ్ హీరోలతో..

టాలెంటెడ్ హీరోలతో..

ఇక స్టార్ హీరోలు కూడా బాలయ్య బాబు అన్‌స్టాపబుల్‌లో షోలో పాల్గొనడానికి ఏ మాత్రం సందేహం చూపించడం లేదని అర్థమైపోయింది. ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ ఏడు ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేశారు. మంచు విష్ణు మంచు మోహన్ బాబు నాచురల్ స్టార్ నాని అల్లు అర్జున్ రవితేజ వంటి టాలెంటెడ్ హీరోలు కూడా బాలయ్య షోలో కనిపించారు.

 మహేష్ తరువాత మరో స్టార్ హీరో

మహేష్ తరువాత మరో స్టార్ హీరో


త్వరలోనే మహేష్ బాబు రానా దగ్గుబాటి వంటివారు కూడా బాలయ్య బాబుతో కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ కూడా వచ్చేసింది. అయితే వీరితో పాటు మరొక స్టార్ హీరో కూడా త్వరలోనే బాలయ్య బాబు అన్‌స్టాపబుల్‌లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. మరో స్టార్ దర్శకుడు కూడా అతనితోపాటు రాబోతున్నాడట.

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్

ఇక ఆ స్టార్ హీరో ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు. రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇద్దరూ కూడా బాలయ్య బాబు ఎంటర్టైన్మెంట్ టాక్ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Recommended Video

RRR టీం కీలక ప్రకటన.. మీరు అనుకున్నట్టు చేయడం లేదంటూ క్లారిటీ! || Filmibeat Telugu
షూటింగ్ ఫినిష్

షూటింగ్ ఫినిష్

మొన్నటి వరకు లైగర్ సినిమాతో చాలా బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ఇప్పుడు గ్యాప్ తీసుకుని బాలయ్య కోసం ప్రత్యేకంగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఈ వారంలోనే ఫినిష్ అయ్యే అవకాశం ఉందట. ఇక ఆ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X