Double iSmart గ్రాండ్ లాంచ్.. షూటింగ్, రిలీజ్ డేట్ అనౌన్స్.. రామ్-పూరి-ఛార్మి పిక్స్ వైరల్
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. మాస్, డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ గా యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. హీరోను ఎలివేట్ చేసే ఆయన విధానానికి యావత్ తెలుగు ఇండస్ట్రీ ఫిదా అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిజంతోపాటు కథానాయకుడిలో కొద్దిపాటి నెగెటివ్ షేడ్స్ చూపించి సరికొత్త పంథాకు పురుడు పోశాడు జగన్. ఇక ఆయన రాసే డైలాగ్ లు గన్ నుంచి వచ్చే బుల్లెట్లా ఉంటాయి. అయితే ఇటీవల లైగర్ భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా షెడ్యూల్, రిలీజ్ తేదిలను ఇప్పుడే ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.
బాక్సాఫీస్ వద్ద:స్టార్ డైరెక్టర్ గా పేరొందిన పూరి జగన్నాథ్.. ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ లు ఇచ్చాడు. అప్పటివరకు క్లాస్ హీరోలుగా పేరొందిన కథాయనాయకులకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చాడు. అలాంటి వారిలో రామ్ పోతినేని ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతోపాటు రామ్ కెరీయర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్ హిట్ గా నిలిచింది. ఇక దీనికి సీక్వెల్ గా సినిమా రానన్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

పూజా కార్యక్రమాలు:ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా రానున్నట్లు పోస్టర్ ద్వారా ఇటీవల ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ అంటే జూలై 10 సోమవారం రోజున ప్రత్యేక అతిథుల సమక్షంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు.
క్లాప్ కొట్టిన ఛార్మి:డబుల్ ఇస్మార్ట్ పూజా కార్యక్రమంలో పూరి జగన్నాథ్, రామ్ పోతినేని, ఛార్మి పాల్గొన్నారు. ఈ విషయాన్ని పూరి కనెక్ట్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. వీరికి సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా లాంచ్ లో ఛార్మి క్లాప్ కొట్టగా.. హీరో రామ్ పోతినేనిపై పూరి జగన్నాథ్ స్వయంగా దర్శకత్వం వహించారు.
రెండ్రోజుల్లో:డబుల్ ఇస్మార్ట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 12 (రెండ్రోజుల్లో) నుంచి ప్రారంభం కానుందిని మేకర్స్ తెలిపారు. "శివుడి దీవెనలతో ఉస్తాద్ రామ్, పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ పూజా కార్యక్రమం జరిగింది. జూలై 12 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 2024 మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది" అని పూరి కనెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది.
హీరోయిన్ గా సాహో బ్యూటి:మరి లైగర్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసిన పూరికి డబుల్ ఇస్మార్ట్ డబుల్ కిక్ ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ సాహో ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు టాక్ వస్తోంది. మరొక హీరోయిన్ గా మీనాక్షి చౌదరిను తీసుకున్నట్లు సమాచారం. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











