బాలయ్య బాబుతో సినిమాపై పూరి జగన్నాథ్.. కొంచెం కొత్తగా అంటూ!

గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న పూరి జగన్నాథ్ ఈ సారి కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మాస్ మసాలా జోడించి 'ఇస్మార్ట్ శంకర్' తో ఎలాగైనా హిట్ పట్టేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. దీంతో పూరి నెక్స్ట్ సినిమా బాలకృష్ణతో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో సినిమాపై స్పందించారు పూరి జగన్నాథ్. బాలయ్యతో సినిమా ఎప్పుడు ఉంటుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. బాలకృష్ణ సినిమా అంటే ఆయన రేంజ్ కి తగ్గ కథ రెడీ చేయాలని, అది సిద్దమయిన వెంటనే బాలయ్యబాబుకు వినిపిస్తానని అన్నాడు. ఇప్పటికే తన దగ్గర కొన్ని కథలున్నాయని, అయితే బాలయ్యతో సినిమా అంటే కొత్తగా ఏమైనా ఉండాల్సిందే కాబట్టి ఆ పని మొదలు పెట్టాలనుకుంటున్నానని అన్నాడు పూరి.

Puri Jagannadh Respoce On Nandamuri Balakrishna

బాలయ్యబాబు- పూరి జగన్నాథ్ కాంబోలో గతంలో వచ్చిన 'పైసా వసూల్' సినిమా ఆశించిన మేర వసూళ్లు రాబట్టకపోవడంతో ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. పూరి వర్కింగ్ స్టైల్ నచ్చడంతో మరో సినిమా చేద్దామని పైసా వసూల్ షూటింగ్ సమయంలోనే పూరికి మాటిచ్చాడట బాలయ్యబాబు. ఈ మేరకు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పూర్తికాగానే పూరి-బాలయ్య కాంబినేషన్ లో సినిమాను పట్టాలెక్కించాలని భావించారు. కానీ బాలయ్యకు సరైన కథ అందుబాటులో లేకపోవడంతో పూరి.. ఇస్మార్ట్ శంకర్ పనుల్లో పడగా, బాలకృష్ణ- కేఎస్ రవికుమార్ సినిమా మొదలుపెట్టాడు. మరికొద్ది రోజుల్లోనే పూరి జగన్నాథ్ ఫ్రీ కానున్నాడు కాబట్టి ఇక బాలయ్య కోసం పవర్ ఫుల్ కథ రేడే చేస్తాడేమో చూడాలి మరి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X