For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అబద్ధం చెప్పి ఎంజెలీనా జోలీ మంచమెక్కిన పూరీ.. అదో సాటిస్ఫాక్షన్ అంటూ!

  |

  తనదైన పంచ్‌ డైలాగ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు పూరీ జగన్నాథ్ గత కొంత కాలంగా 'పూరీ మ్యూజింగ్స్‌' పేరుతో అనేక అంశాలపై తన ఆలోచనలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన వెనిస్ అనే ఒక సిటీ గురించి పూరీ మ్యుజింగ్స్‌లో చర్చించాడు. ప్రస్తుతం పూరీ పాడ్ కాస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  మళ్ళీ పూరీ మ్యూజింగ్స్

  మళ్ళీ పూరీ మ్యూజింగ్స్

  గతేడాది 'పూరి మ్యూజింగ్స్' అంటూ ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ కారణంగా వరుస పోడ్ కాస్ట్ ఆడియోలతో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. ఇప్పటికే రాజముడి రైస్ సహా పలు అంశాల స్పందిస్తున్న ఆయన తాజాగా ఇటలీ దేశంలో ఉన్న ఒక అందమైన నగరం వెనిస్ గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు.

  వెనిస్ నగరం

  వెనిస్ నగరం

  వెనిస్ న‌గరం గురించి మాట్లాడిన పూరీ ఆ నగరంలోనే తాను హాలీవుడ్ న‌టి ఎంజెలీనా జోలి మంచం మీద కూర్చున్నాను అని చెప్పుకొచ్చారు. సుదీర్ఘంగా నాలుగు నిమిషాల పాటు ఆయన ఈ నగరం గురించి తన అనుభవాలను తనకు తెలిసిన విషయాలను శ్రోతలతో పంచుకున్నారు. ఈ సమయంలోనే ఆయన ఎంజెలీనా జోలి గురించి కూడా ప్ర‌స్తావించారు. ఇంత‌కీ పూరీ ఏం చెప్పారనే విషయాల్లోకి వెళితే

  ఎప్పుడు కట్టారు అంటే

  ఎప్పుడు కట్టారు అంటే

  ప్రపంచంలో అంద‌మైన న‌గ‌రాల్లో వెనిస్ ఒక‌టి అని పేర్కొన్న ఆయన దీన్ని వెన్నిసియా అని కూడా అంటారనీ చెప్పుకొచ్చారు. ఇది ఇట‌లీకి నార్త్ ఈస్ట్ సిటీ అని బి.సి టెన్త్ సెంచ‌రీలో ఈ నగరాన్ని నిర్మించారని పేర్కొన్నారు. 118 ఐ ల్యాండ్స్ ( ద్వీపాలు) ఉంటాయన్న ఆయన వాటి మీద వెనిస్ నగరాన్ని నిర్మించారనీ పేర్కొన్నారు. ప్ర‌తి ద్వీపానికి ఒక కాలువ తవ్వి క‌ట్టి వాటిని క‌నెక్ట్ చేస్తూ 400 చిన్న బ్రిడ్జిల‌ను నిర్మించారని అన్నారు.

  ఎక్కడికి వెళ్ళినా పడవలే

  ఎక్కడికి వెళ్ళినా పడవలే

  ఈ సిటీలో కార్లు, బైకులు ఉండ‌వన్న పూరీ ఓ ఇంటి నుంచి మ‌రో ఇంటికి వెళ్లాలంటే పడవలే దిక్కని అన్నారు. గండోలా అనే 11 అడుగులు ఉండే అంద‌మైన‌ ప‌డ‌వ వేసుకుని తిరగాల్సిందే అని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత మార్కోపొలో అనే ర‌చ‌యిత ఈ న‌గ‌రానికి చెందిన‌వాడేనని ఆయన అన్నారు.

  డ‌స్ట‌బిన్స్ కూడా అందంగా

  డ‌స్ట‌బిన్స్ కూడా అందంగా

  ఇక ఈ సిటీలో అణువ‌ణువు అందంగా ఉంటుందని దీపాలు, బెంచీలు, అఖ‌రికి డ‌స్ట‌బిన్స్ కూడా అందంగా డిజైన్ చేస్తారని చెప్పుకొచ్చాడు. ఎస్ ఆకారంలోని గ్రాండ్ కెనాల్‌, ఈ సిటీని రెండు వేర్వేరు భాగాలు అనేలా భ్రమింప చేస్తుందనీ ఆయన అన్నారు. ఈ సిటీలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ్యూజిషియ‌న్స్ ఏదో ఒక వాయిద్యం వాయిస్తూ క‌నిపిస్తారనీ అన్నారు.

  అబద్ధం చెప్పి ఆమె మంచం ఎక్కి

  అబద్ధం చెప్పి ఆమె మంచం ఎక్కి

  ఇక తాను అక్క‌డికి వెళ్లిన‌ప్పుడు హాలీవుడ్ న‌టి ఎంజెలీనా జోలి అప్పుడే అక్క‌డ ఉండే డానేయేలి అనే హోట‌ల్లోని రూమ్ ఖాళీ చేసింద‌ని తెలియడంతో వెంటనే ఆ హోట‌ల్‌కు వెళ్లి.. షూటింగ్ చేయాల‌ని అబ‌ద్దం చెప్పి, ఆమె ఉండే రూమ్‌కు వెళ్లి ఆమె ప‌డుకున్న బెడ్‌పై కాసేపు కూర్చుకున్నాననీ చెప్పుకొచ్చాడు. అదో శాటిస్పాక్ష‌న్‌ అని ఆయన అన్నారు. ఇక ఈ వెనిస్ న‌గ‌రం రోజు రోజుకీ మున‌గిపోతుంద‌ని, 2030 నాటికి ఈ న‌గ‌రం స‌గం మునిగిపోయి ఘోస్ట్ సిటీ అవుతుంద‌ని అంటున్నారని అందుకే వీలైతే వెన్నిస్‌ను ఓసారి చూడండనీ ఆయన సలహా ఇచ్చారు.

  లైగర్ తో


  సినిమాల విషయానికి చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. లైగర్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ అలాగే కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  English summary
  tollywood top director Puri Jagannath started a YouTube channel called Puri musings. he sharing his experience and his views on several topics. recently he shared his experience on the city of Venice, he also revealed some interesting facts about his when is trip.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X