For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడాకుల గురించి కీలక విషయాలు వెల్లడించిన పూరీ.. భార్య కంటే వాట్సాప్ నయం అంటూ!

  |

  కరోనా వైరస్ పుణ్యమా అంటూ ప్రజలకు పరిచయమైన ఈ లాక్ డౌన్ లో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఏదో ఒక అంశాన్ని తీసుకుని పూర్తిగా అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. యూట్యూబ్ వేదికగా చేసుకొని 'పూరీ మ్యూజింగ్స్' అనే పేరుతో విభిన్న అంశాలు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ఆలోచనల్లో పడేస్తున్నాడు. తాజాగా విడాకుల గురించి ఆయన కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  మాల్దీవులకి హనీమూన్ కి వెళ్లి

  మాల్దీవులకి హనీమూన్ కి వెళ్లి

  లాక్ డౌన్ ముందు హనీమూన్ కోసం ఒక జంట మాల్దీవులలో గడపడానికి వెళ్లారని కానీ అనుకోకుండా కరోనా లాక్ డౌన్ కావడంతో వాళ్ళిద్దరూ నాలుగు నెలల పాటు అదే దీవిలో ఉండిపోవలసి వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి బయటకు రాగానే ఇద్దరు విడాకులు తీసుకున్నారు అని ఆయన అన్నారు. ఈ కరోనా దయవల్ల మన జీవితాల్లో ఏదయితే జరగకూడదో అదే జరిగిందని అన్నారు.

  రాత్రి పగలు తేడా లేకుండా

  రాత్రి పగలు తేడా లేకుండా

  రాత్రి పగలు తేడా లేకుండా మొగుడు పెళ్ళాలు నెలల తరబడి కలిసి ఉండాల్సి వచ్చిందని అందుకే గత ఏడాది కరోనా ఎంటరైనప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలో భారీ ఎత్తున విడాకుల కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. దానికి భారీ అంచ‌నాలు, అప‌రిమిత‌మైన స్వేచ్ఛ విడాకుల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పూరి చెబుతున్నాడు.

  అంచ‌నాలు పెరిగి విడాల‌కుల వైపు

  అంచ‌నాలు పెరిగి విడాల‌కుల వైపు

  మ‌రీ ముఖ్యంగా ఈ కరోనా సిట్యుయేష‌న్ లో భార్యాభ‌ర్త‌లు అత్య‌ధిక స‌మ‌యం ఒక‌రితో ఒక‌రు గ‌డ‌పడం వ‌ల్ల కూడా అంచ‌నాలు పెరిగి విడాల‌కుల వైపు వారి దాంప‌త్య జీవితం సాగుతోంద‌ని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక పెళ్ళికి కౌన్సిలింగ్ అనేది చాలా అవ‌స‌ర‌మ‌ని, కనీసం రెండేళ్ల పాటు అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డిన త‌ర్వాతే పెళ్ళి చేసుకోవాల‌ని ఆయన అన్నారు.

   డైవర్స్ రేటు తక్కువే కానీ

  డైవర్స్ రేటు తక్కువే కానీ


  అలాగే ఈ కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ కింగ్డం చరిత్రలో మొట్టమొదటిసారిగా 122 శాతం కేసులు పెరిగాయని ఆయన అన్నారు. ఇక చైనా అలాగే అమెరికా పరిస్థితి చెప్పక్కర్లేదు అని అన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత దేశంలో డైవర్స్ రేటు తక్కువే కానీ మన దేశంలో కూడా గత ఏడాది నుంచి ఇప్పటి దాకా డైవర్స్ రేటు బాగా పెరిగిందని అన్నారు

  Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Filmibeat Telugu

  పెళ్ళాం కంటే వాట్సాప్ బెటర్

  ఇక విడాకుల‌కు ఉన్న‌ట్టుగానే పెళ్ళికీ స‌రైన లీగ‌ల్ ప్రాసెస్ ఉండాల‌ని పూరీ అభిప్రాయపడ్డారు. ఒంట‌రిగా ఉండ‌లేక‌ పెళ్ళి చేసుకుంటే. ఇక అంతే సంగ‌తులు అని ఆయన హెచ్చ‌రిస్తున్నారు. భార్యాభ‌ర్త‌లు ఒక‌రితో ఒక‌రు నిజానికి అర‌గంట మించి మాట్లాడుకోలేర‌ని, సో... మ‌గ‌వాళ్ళు వీలైనంత వ‌ర‌కూ త‌న స్నేహితుల‌తో క‌బుర్లు చెబుతూ, టీవీ, వాట్స్ అప్ చూస్తూ టైమ్ పాస్ చేయాల‌ని, అప్పుడే ఈ కరోనా రోజుల‌లో వివాహ బంధాన్ని భ‌ద్రంగా ఉంచుకోగ‌ల‌మ‌ని స‌ల‌హా ఇస్తున్నాడు.

  English summary
  Director Puri Jagannadh has come up with another interesting topic ‘Divorce’ for his Puri Musings. he says “High expectations and freedom are the main reasons for Divorce.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X