మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి డైరెక్టర్ అతడేనా!
నందమూరి అభిమానులంతా బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా రోజులుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. కానీ ఏదీ తేలడంలేదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం పూర్తయ్యాక బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రం గురించి దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మోక్షజ్ఞని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హీరోకి డిఫెరెంట్ మేనరిజమ్స్ క్రియేట్ చేసి అలరించడంలో పూరి జగన్నాథ్ ది ప్రత్యేక శైలి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని చిరుత చిత్రంలో లాంచ్ చేసింది పూరీనే కావడం విశేషం.

బాలయ్య కూడా పూరి పట్ల సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రం గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య పూరీనే లేక మరో దర్శకుడికి తన కుమారుడిని లాంచ్ చేసే బాధ్యతలు అప్పగిస్తాడా అనేది చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











